
బంగారం కొనాలకునేవారికి గుడ్ న్యూస్. అంతర్జాతీయంగా బంగారం ధరలు పతనమయ్యాయి. ఈ కారణంగా దేశీయంగా ఈ ధరలు తగ్గనున్నాయి. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1964 డాలర్ల వద్ద ఉండగా ఇవాళ 1948 డాలర్ల వద్ద కొనసాగుతుంది. అయితే మొన్న గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1957 డాలర్లు ఉండగా.. నిన్న 1964 డాలర్లకు పెరిగింది. దీంతో దేశీయంగా ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. ఔన్స్ స్పాట్ వెండి కూడా మొన్న 24.31 డాలర్లు ఉండగా నిన్న 24.72 డాలర్ల వద్ద కొనసాగింది. దీంతో దేశీయంగా ఇవాళ వెండి ధర పెరిగింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,250 ఉండగా ఇవాళ రూ. 150 పెరిగింది.
దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. 55,400 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ. 60,280 ఉండగా ఇవాళ రూ. 160 పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం హైదరాబాద్ మార్కెట్లో రూ. 60,440 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర కూడా భారీగా పతనమైంది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర ఇవాళ భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న పెరగడంతో ఇవాళ దేశీయంగా పెరిగింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 80 వేలు ఉండగా ఇవాళ రూ. 1000 పెరిగింది.
దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 81 వేల వద్ద కొనసాగుతుంది. అయితే ఈ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ప్రతికూలంగా సాగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1948.56 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. స్పాట్ వెండి 24.38 డాలర్ల వద్ద కొనసాగుతుంది. దీంతో ఈ ధరలు దేశీయంగా తగ్గనున్నాయి. కాబట్టి బంగారం, వెండి కొనాలనుకునేవారు ఒకరోజు ఆగి కొనడం మంచిది.
ఆగస్టు 2న క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 5,540 ( ₹ +15 )
- 8 గ్రాములు: ₹ 44,320 ( ₹ +120 )
- 10 గ్రాములు: ₹ 55,400 ( ₹ +150 )
- 100 గ్రాములు: ₹ 5,54,000 ( ₹ +1500 )
ఆగస్టు 2న 24 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 6,044 ( ₹ +16 )
- 8 గ్రాములు: ₹ 48,352 ( ₹ +128)
- 10 గ్రాములు: ₹ 60, 440 ( ₹ +160 )
- 100 గ్రాములు: ₹ 6,04,400 ( ₹ +1600 )
ఆగస్టు 2న వెండి ధరలు:
- 1 గ్రాము: ₹81 ( ₹ +1 )
- 8 గ్రాములు: ₹ 648 ( ₹ +8 )
- 10 గ్రాములు: ₹ 810 ( ₹ +10 )
- 100 గ్రాములు: ₹ 8,100 ( ₹ +100 )
- 1000 గ్రాములు: ₹ 81,000 ( ₹ +1000 )
from SumanTV https://ift.tt/FVxeLA6