టిపిసిసి అధ్యక్షులు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించారంటూ బిఆర్‌ఎస్ నేతలు ఇసికి ఫిర్యాదు చేశారు. దీంతో సిఎంకు ఇసి నోటీసులు ఇచ్చింది.
from Mana Telangana https://ift.tt/hSsGpOa
Tags:
Mana Telangana