కండ్ల కలక విజృంభణ.. తెలుగు రాష్ట్రాల్లో 1000 కేసులు నమోదు!

eye-conjunctivitis

తెలంగాణలో బీభత్సం సృష్టించిన వానలు ఆస్తి, ప్రాణ నష్టాలను మిగిల్చాయి. పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకోవడంతో ప్రజలు నరకయాతన అనుభవించారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఓ పక్క వర్షాలతో సతమతమవుతుంటే మరొపక్క వ్యాధులు ప్రభలుతున్నాయి. అక్కడక్కడ త్రాగు నీరు కలుషితమవడంతో డయోరియా, జ్వరాలు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే మరో వ్యాధి తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తూ కలవరపెడుతోంది. కళ్లకు సంబంధిచిన కండ్ల కలక అనే జబ్బు సోకి భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరి ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటి? దీని లక్షణాలు, నివారణ గురించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వానాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులతో వివిద రకాల బాక్టీరియాలు, వైరస్ లు అటాక్ చేయడంతో వైరల్ ఫీవర్లు, దగ్గు, జలుబు వంటి రోగాలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కళ్లకు సంబంధించిన వ్యాధులు జనాలను భయపెడుతున్నాయి. కళ్లకు కండ్ల కలక సోకుతూ తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. కండ్ల కలక.. దీనినే పింక్ ఐ అని కూడా అంటారు. ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో గురుకుల పాఠశాలల్లోని కొందరు విద్యార్థులు కండ్ల కలకతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కండ్ల కలక వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, అలర్జీల వల్ల వస్తుంది. అడెనోవైరస్‌ వంటి ఒక ప్రత్యేక వైరస్‌ల సమూహంతోనూ ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయి. కండ్ల కలక అంటు వ్యాధి. కాగా కండ్ల కలకను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

లక్షణాలు

కళ్లు ఎరుపు రంగులోకి మారటం, కంటి దురద, కళ్లు మండటం, కళ్లు వాపెక్కడం, కంట్లోంచి నీరు కారటం, లైట్ల వెలుగును చూడలేకపోవటం, జ్వరం.

కండ్లకలక నివారణ

మొదటగా శుభ్రతను పాటించాలి. చేతులను మురికి లేకుండా కడుక్కోవాలి. కళ్ల ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. దుమ్ము, ధూళీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు కళ్లల్లో పడకుండా జాగ్రత్త వహించాలి. కండ్ల కలక వ్యాధికి గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్యులు సూచించిన మందులను, ఐ డ్రాప్స్, అనెల్జెసిక్స్‌ ను వాడాలి.

కండ్ల కలక 2 రకాలు

ఒకటి ‘ఫారింగో-కంజన్టివల్‌-ఫీవర్‌. ఇది తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటుంది. జలుబు లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్న పిల్లలు, యువకులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

రెండవది ఎపిడమిక్‌ కెరటో కన్జంక్టివైటిస్‌. దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలుంటాయి. ఇది కంటి ముందు భాగాన్ని (కార్నియా)ను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక కంటి సమస్యలకు కారణమవుతుంది



from SumanTV https://ift.tt/hF9cmUu

Post a Comment

Previous Post Next Post

Below Post Ad