
Samantha: హీరోయిన్ సమంత అప్పులపాలయ్యారనే ఓ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. తన వైద్యం కోసం సమంత భారీగా అప్పు చేశారని సదరు కథనాల సారాంశం. సమంతకు గత ఏడాది మయోసైటిస్ సోకింది. ఈ వ్యాధికి ఆమె చికిత్స తీసుకుంటున్నారు. 2022 అక్టోబర్ నెలలో సమంత మయోసైటిస్ బారినపడిన విషయం వెల్లడించారు. అలాగే ఓ ఇంటర్వ్యూలో ఇదేమీ ప్రాణాంతకం కాదు. నేను చనిపోవడం లేదు. అలా అని సమస్య చిన్నది కూడా కాదు. నేను పోరాడాల్సి ఉందన్నారు.
సమంత షూటింగ్స్ లో పాల్గొన్నప్పటికీ ఆమె పూర్తి స్థాయిలో కోలుకోలేదట. త్వరలో ఆమె చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారట. అక్కడ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటారట. ఈ ట్రీట్మెంట్ కి ఏకంగా రూ. 25 కోట్లు ఖర్చు అవుతుందట. ఈ మొత్తాన్ని ఓ స్టార్ హీరో వద్ద సమంత అప్పు చేశారట. ఆయనకు త్వరలో చెల్లిస్తానని హామీ ఇచ్చారట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది.
కొందరేమో ఈ పుకార్లను కొట్టిపారేస్తున్నారు. సుదీర్ఘ కెరీర్లో సమంత వందల కోట్లు సంపాదించింది. ఆమె ఒకరి వద్ద అప్పు చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఇది ఎవరో పుట్టించిన పుకారు మాత్రమే అంటున్నారు. సమంత ఒక్కో సినిమాకు ఋ. 4 నుండి 5 కోట్లు తీసుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఇంకా ఎక్కువే ఉంటుంది. వెబ్ సిరీస్ చేస్తుంది. పలు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంది.
సమంత పెద్ద మొత్తంలో ఆదాయం కలిగి ఉంది. ప్రస్తుతం సమంత ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ పూర్తి చేశారు. ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించారు.శివ నిర్వాణ దర్శకుడు. ఇక సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
source https://oktelugu.com/samantha-who-borrowed-25-crores-from-that-star-hero-because/