
Chanakya Niti: జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఉంటాయి.. లాభ నష్టాలు ఉంటాయి.. వీటిని అధిగమిస్తూ ముందుకెళ్లాలి. ఇలా ముందుకెళ్లాలంటే మనోధైర్యం ఉండాలి. ఎన్ని కష్టాలొచ్చినా సమయస్ఫూర్తి అనేది కచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడే ముందుకు సాగకలుగుతాం. అయితే కొందరిక ఇలాంటి విషయాలను ‘చాణక్య’ తన నీతి శాస్త్రంలో వివరించాడు. మనుషులు జీవిత చరమాంకలో జరిగే కొన్ని ప్రక్రియల్లో కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను వివరించాడు. వీటిలో కొన్ని విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పాడు. ఈ విషయాలు ఇతరులతో పంచుకోవడం వల్ల కష్టాలే తప్ప ఎలాంటి ప్రయోజనాలు ఉండవని వివరించాడు.
ప్రతీ మనిషికి జీవతంలో ఎవరో ఒకరు తోడుగా ఉంటారు. వీళ్లే కష్ట సుఖాలను పంచుకున్నవాళ్లవుతారు. కొంత మందికి ఆఫీసుల్లో తోటి ఉద్యోగులు, రిలేషన్ షిప్ లో బంధువులు జీవిత విషయాలు పంచుకుంటూ ఉంటారు. అయితే సాధారణ విషయాలు చెప్పిన పర్వాలేదు. కానీ కొన్ని విషయాలను మాత్రం కచ్చితంగా చెప్పకుండా ఉంటేనే జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయని చాణక్యుడు చెప్పాడు. ఆ వివరాల్లోకి వెళితే..
ఉద్యోగం పురుష లక్షణం అన్నారు.. ప్రతీ మగాడు ఏదో ఒక పనిచేయాల్సిందే. అయితే కొందరు ఎక్కువ..మరికొందరు తక్కువ ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ క్రమంలో తమకు వచ్చే ఆదాయాన్ని ఇతరులతో షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిదని చాణక్యుడు చెప్పాడు. తనకు వచ్చే ఆదాయంతో ఇతరులకు చెప్పడం వల్ల చెడు దృష్టి పడే అవకాశం ఉంది. అంతేకాకుండా కొందరు తోటి ఉద్యోగులే ఆదాయం రావడానికి ఆటంకాలు సృష్టించే ప్రమాదం ఉందని చెప్పాడు.
దాంపత్య జీవితంలోని కొన్ని రహస్యాలను ఇతరులతో పంచుకోకుండా ఉండడం చాలా మంచిది. కొన్ని పర్సనల్ విషయాలు ఇతరులకు చెప్పడం వల్ల వారికున్న అభిప్రాయాన్ని చెబుతారు. ఈ క్రమంలో ఇవి భాగస్వామి వద్ద ప్లే చేయడంతో ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ దెబ్బతినే అవకాశం ఉంది. పైగా పర్సనల్ విషయాలు బయటకు చెప్పడం వల్ల భాగస్వామిపై అపనమ్మకం ఏర్పడుతుంది.
ప్రతీ వ్యక్తికి కొన్ని లోపాలు, బలహీనతలు ఉంటాయి. ఇవి ఆ వ్యక్తిని కుచించుకుపోయేలా చేస్తాయి. అయితే ఈ విషయాలు ఎదుటివారికి చెప్పకుండా ఉండాలి. లేకుంటే కొన్ని విషయాల్లో ఎదుటి వ్యక్తి ఈ బలహీనతలను బట్టి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అందువల్ల వీటి గురించి అస్సలు చెప్పకూడదు.
ఇక దాన ధర్మాలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తుంటారు. తమకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత ఇతరులకు ఇవ్వాలని చూస్తారు. అయితే ఇలా దానాలు చేసి ఇతరులకు గొప్పలు చెప్పుకోవడం ద్వారా వాటి పుణ్య ఫలం దక్కకుండా ఉంటుందని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు.
source https://oktelugu.com/chanakya-niti-dont-tell-others-these-things-even-by-mistake-otherwise/