బోసిపోయిన నగరం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్‌తో ప్రజలతో కళకళలాడే భాగ్యనగరం బోసిపోయింది. ఎపిలోని పలు ప్రాం తాల నుంచి జీవనోపాధి నిమిత్తం భాగ్యనగరానికి తరలివచ్చి ఇక్కడే ఉంటున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే, ఎపిలో ఓట్ల పండుగ రావడంతో ఇక్కడున్న ఎపి వాసులంతా సోమవారం తమ అ మూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఎపిలోని తమ సొంతూళ్ల బాట పట్టా రు. హైదరాబాద్‌విజయవాడ రహదారిలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌లేర్పడ్డాయి. ప్రధానంగా ఆ ర హదారిలోని టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్‌లేర్పడ్డాయి. ఏ విధంగానైనా ఓటు హక్కుని వినియోగించుకోవాలని తమకు వీలున్న రవాణా సౌకర్యాలను ప్రజలు ఎంచుకుంటూ ఎపిలోని పల్లెబాటకు పడుతున్నారు.

తెలంగాణ, ఎపి ఆర్‌టిసి సర్వీసులు తెలంగాణ నుంచి ప్రజలను తరలించేందుకు తగు ఏర్పాట్లు చేసినప్పటికీ అపరిమితమైన సంఖ్యలో ప్రజలు తరలివస్తుండటంతో ఆయా సర్వీసుల్లో తెలంగాణ నుంచి ఎపికి బస్సులు లభ్యమవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను సైతం ప్రజలు ఆశ్రయించి మరీ ఎపికి తరళి వెళుతున్నారు. దీంతో వచ్చిన అవకాశాన్ని ప్రైవేట్ సర్వీసులు తమకు అనుకూలంగా మార్చుకుని ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ప్రజలనుంచి సొమ్ములు దండుకుంటున్న సందర్భాలున్నాయి. అయితే ఎన్ని అడ్డంకు దెరైనా ఓటు హక్కుని వినియోగించుకోవడమే తమ ప్రధాన కర్తవ్యంగా తలిచిన ఓటర్లు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండానే ఎపి బాట పడుతుంటం విశేషం. అటు రైల్వేస్టేషన్లు, ఇటు బస్‌స్టేషన్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.

ఓట్ల పండుగ కోసం తెలంగాణ రాజధాని ప్రజలంతా ఎపిలోని తమ సొంతూళ్ల బాట పట్టడంతో ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్యనగరంలో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కోఠి, ఆబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, లక్డీకాపూల్ , అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తగ్గాయి. రాత్రి పగలు తేడా లేకుండా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగర రహదారులు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో లోక్‌సభ, ఎపిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.



from Mana Telangana https://ift.tt/2PMBQUv

Post a Comment

Previous Post Next Post

Below Post Ad