
Cold and cough : చలికాలం చాలా మందికి జలుబు కామన్ గా వస్తుంది. ఈ జలుబు, దగ్గు వాతావరణంలో మార్పు వల్ల వచ్చే సాధారణ సమస్య. దీని లక్షణాలు చాలా తీవ్రమైనవి కావు. సాధారణంగా, ఇది ఒక వారంలో కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దానంతటదే నయమవుతుంది. అయితే దీని నుంచి తక్షణ ఉపశమనం పొందాలంటే వేడి పదార్థాలు తాగడం మంచిది అంటున్నారు నిపుణులు. ఈ జలుబు వల్ల చాలా మందికి హెడ్ ఎక్ కూడా వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ జలుబు త్వరగా పోదు. మరి జలుబు తగ్గాలంటే ఏం చేయాలి? ఎలాంటి రెమిడీలు ఉపయోగపడతాయి అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
పుదీనా ఆకు టీ ఒక ఔషధం వలె పనిచేస్తుంది. ఇది యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంది. ఇది సంక్రమణను తగ్గిస్తుంది. జలుబు లక్షణాలను తగ్గిస్తుంది. అయితే ఇది ఎలా పని చేస్తుంది? దానిని వినియోగించే సరైన మార్గం ఏమిటి, అనే వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముక్కు దిబ్బడ:
పిప్పరమెంటులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అలెర్జీల కారణంగా బ్లాక్ అయిన సైనస్‌లను తగ్గిస్తుంది. ఇది కాకుండా, మెంథాల్ సమ్మేళనం కూడా ఇందులో ఉంటుంది. ఇది గాలి ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది.
గొంతు నొప్పికి ఉత్తమ టీ
పుదీనాలో రోస్మరినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది గొంతు నొప్పి, ముక్కు కారటం వంటి అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మెంథాల్ గొంతు నొప్పిని తగ్గించే సహజ అనాల్జేసిక్‌గా పనిచేస్తుందని, గొంతు కణజాలంలో వాపు, చికాకును తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
పుదీనా టీ ఎలా తయారు చేయాలి
ఒక కప్పు నీటిని మరిగించండి. తర్వాత స్టవ్ మీద నుంచి దించి అందులో కొన్ని పుదీనా ఆకులను వేయాలి. దానిని కవర్ చేసి 3-4 నిమిషాలు అలాగే ఉంచండి. దీన్ని వడపోసి తీపి కోసం 1 టీ స్పూన్ తేనె కలుపుకుని తాగాలి.
ఆవిరి: ఆవిరి పట్టడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముక్కులో ఉన్న డస్ట్ కూడా తొలిగిపోతుంది. అయితే ఈ ఆవిరి పట్టడానికి మీరు కాస్త సమయం తీసుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ ను హీట్ చేసి అందులో కాస్త పసుపు, జండుబాబ్ వేసి బాగా మసిలే నీటితో ఆవిరి పట్టుకోవాలి. ఇలా ఆవిరి పట్టేటప్పుడు మీ మీద ఓ దుప్పటి కప్పుకుంటూ పట్టండి. దీని వల్ల మొత్తం స్ట్రీమ్ కూడా ఫేస్, ముక్కులోకి మాత్రమే పోతుంది. ఇలా రెండు మూడు సార్లు చేస్తే మీకు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..
source https://oktelugu.com/health/are-you-suffering-from-a-cold-or-cough-just-try-this-492486.html