క్రికెట్‌కు అండర్సన్ గుడ్‌బై!

ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 41 ఏళ్ల అండర్సన్ సుదీర్ఘ కాలం పాటు ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. వెస్టిండీస్ ఈ ఏడాది జులై 10 నుంచి లార్డ్ వేదికగా జరిగే టెస్టు మ్యాచ్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకోవాలని అండర్సన్ నిర్ణయించాడు. అతను ఇప్పటికే వన్డేలు, టి20లకు గుడ్‌బై చెప్పాడు. అయితే టెస్టుల్లో మాత్రం ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అండర్సన్ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. 187 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

ఈ క్రమంలో 700 వికెట్లను పడగొట్టాడు. ఇదే సమయంలో టెస్టుల్లో 700 వందల వికెట్లను పడగొట్టిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అండర్సన్ కంటే ముందు శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (800), ఆస్ట్రేలియా స్టార్ షేన్ వార్న్ (709) ఈ రికార్డును సాధించారు. కాగా, టెస్టుల్లో అండర్సన్ రికార్డు స్థాయిలో 32 సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లను పడగొట్టాడు. మరోవైపు వన్డేల్లో, టి20లలో కూడా అండర్సన్ మెరుగైన ప్రదర్శన చేశాడు.



from Mana Telangana https://ift.tt/V1qHmKz

Post a Comment

Previous Post Next Post

Below Post Ad