
Sleeping Tips : ఉద్యోగాలు, బీజీ లైఫ్, నైట్ లైఫ్ జాలీ వంటి వాటివల్ల సరైన సమయానికి చాలా మంది నిద్ర పోవడం లేదు. ఇలా సరైన సమయానికి నిద్రపోకపోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయట. అయితే ఇప్పుడు మరో అధ్యయనం ఇప్పుడు నిద్ర విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి అని చెబుతుంది. ప్రతి సారి ఒకే సమయానికి నిద్ర పోవాలట. లేదంటే చాలా సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఇక ఉద్యోగులు వారి షిఫ్టుల వల్ల ఒకే సమయానికి అసలు నిద్రపోరు. దీన్ని సోషల్ జెట్ లాగ్ అంటారు. ఒక వారంలో నిద్రపోయే సమయంలో 90 నిమిషాలు తేడా వస్తే శరీరంలో మైక్రోబయోటా జాతులు ఉత్పత్తి అవుతాయని. వీటి వల్ల చిప్స్, షుగర్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తినాలనిపిస్తుంది అంటున్నారు నిపుణులు. దీని వల్ల సరైన ఆహారం తీసుకోరు. తద్వారా ఊబకాయం, కడుపులో మంట, స్ట్రోక్ వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
ఎందుకంటే ఆరోగ్యకరమైన శరీరానికి పోషకాహారం వలె, మంచి నిద్ర కూడా ముఖ్యం. తగినంత నిద్ర లేని వ్యక్తులు కాలక్రమేణా అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక రాత్రి కూడా నిద్ర లేకపోవడం వల్ల, మరుసటి రోజు మీరు అలసట, బలహీనత, చిరాకు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. పెద్దలు రాత్రికి 6-8 గంటలు నిరంతరాయంగా నిద్రపోవాలని సిఫార్సు చేస్తారు. మీరు ప్రతి రాత్రి తగినంత నిద్ర పొందగలుగుతున్నారా? లేదా అని కచ్చితంగా ఆలోచించాలి.
ఒక అధ్యయనంలో, ఆరోగ్య నిపుణులు మీకు మంచి నిద్ర రాకపోతే, రాత్రిపూట తరచుగా నిద్రకు భంగం కలిగితే లేదా అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గాఢ నిద్రను పొందలేకపోతే, మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి, చిత్తవైకల్యం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
నిద్ర మెదడును కూడా ప్రభావం చేస్తుంది అంటున్నారు నిపుణులు. నిద్ర ఎందుకు చాలా ముఖ్యమైనది అనుకుంటున్నారా? అది లేకపోవడం మన ఆరోగ్యానికి ఎలా హానికరం అని అర్థం చేసుకోవడానికి నిపుణుల బృందం ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. తగినంత నిద్ర లేకపోతే భవిష్యత్తులో అల్జీమర్స్ లేదా డిమెన్షియా వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు.
హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని పరిశోధకులు 65, అంతకంటే ఎక్కువ వయస్సు గల 2,800 మంది వ్యక్తులపై అధ్యయనం చేశారు. రాత్రిపూట ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి తర్వాత డిమెన్షియా వచ్చే ప్రమాదం రెండింతలు ఉంటుందని నిపుణులు తెలిపారు. ప్రతి రాత్రి ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే అటువంటి వారిలో అకాల మరణ ప్రమాదం కూడా ఎక్కువగా కనిపిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..
source https://oktelugu.com/lifestyle/going-to-bed-at-the-same-time-every-day-492211.html