31న వస్తున్న ‘మద గజ రాజా’

హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మద గజ రాజా. సుందర్.సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా తమిళ్ లో విడుదలై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని, 50 కోట్లకు పైగా వసూలు చేసి, సంక్రాంతి కి విడుదలైన తమిళ సినిమాలన్నిటిలో నంబర్ వన్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటికీ భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకు వెళ్తున్న, యాక్షన్ కామెడీ జానర్ లో రూపొందిన ’మద గజ రాజా’ ఆడియన్స్ కి మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించే ఎంటర్‌టైనర్.

హీరో విశాల్ తన పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో అదరగొట్టారు. సంతానం కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డైరెక్టర్ సుందర్.సి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో హోల్సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. విజయ్ ఆంటోని పాటలన్నీ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తమిళ్ లో ఘన విజయం సాధించి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని కూడా అద్భుతంగా అలరిస్తుందని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రంలో సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్ కీలక పాత్రలు పోషించారు.



from Mana Telangana https://ift.tt/3g2p8jw

Post a Comment

Previous Post Next Post

Below Post Ad