అర్ధరాత్రి వ్యక్తిపై కత్తులతో దాడి: హత్య

బేకరీలో పనిచేస్తున్న ఒక వ్యక్తిపై అకారణంగా కత్తులతో దాడిచేసి హత్యచేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి శాలిబండ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ దాడిలో బేకరీ నిర్వాహకులైన ము గ్గురు సోదరులు సైతం గాయపడ్డారు. ఇన్‌స్పెక్టర్ ఎస్.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం… జహనుమా నుండి కాలాపత్తర్ వెళ్ళేదారిలో ఉన్న ఫాతిమా ఆసుపత్రి వద్ద వాజీద్, సాజీద్, ఖదీర్ అనే ముగ్గురు సోదరులు దక్కన్ బేకరీని నిర్వహిస్తున్నారు. కాలాపత్తర్‌కు చెందిన రఫీక్ సిమ్లాన్ (40) ఆ బేకరీలో పనిచేస్తున్నాడు. కాలాపత్తర్ రౌడీషీటర్ అసద్, అన్వర్‌లు బేకరీలో పనిచేస్తున్న రఫీక్ సిమ్లాన్‌పై బుధవారం అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో కత్తులతో దాడిచేశారు.

తీవ్ర గాయాలైన రఫీక్ అక్కడిక్కడే మృతి చెం దా డు. అడ్డువచ్చిన ముగ్గురు సోదరులలో వాజీద్‌కు బాగా గాయాలు కాగా సాజీద్, ఖదీర్లకు స్వల్ప గాయాలైయ్యాయి. విషయం తెలుసుకున్న శాలిబండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రఫీక్ సిమ్లాన్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాయపడిన సోదరులకు చికిత్స అందించారు. పరారీలో ఉన్న నిందితులు అసద్, అన్వర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారు పట్టుబడితే తప్పా హత్యకు కారణాలు తెలియవని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



from Mana Telangana https://ift.tt/65fVasy

Post a Comment

Previous Post Next Post

Below Post Ad