జార్ఖండ్‌లో ఇడి దాడులు రూ కోటి , 100 బుల్లెట్లు స్వాధీనం

జార్ఖండ్ రాజధాని రాంచీలో శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వర్గాలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలో రూ 1 కోటి వరకూ నగదు, వంద బుల్లెట్లను స్వాధీనపర్చుకున్నారు. జార్ఖండ్ మాజీ సిఎం, జెఎంఎం నేత హేమంత్ సోరెన్‌పై దాఖలైన భూ కబ్జా కేసు దర్యాప్తు క్రమంలో ఇడి దూకుడు పెంచింది. ఇప్పుడు జరిగిన ఇడి దాడులు, సొత్తు , బుల్లెట్ల రికవరీ వేరే భూమికి సంబంధించిందని అధికార వర్గాలు శనివారం తెలిపాయి.ఇప్పుడు ఇక్కడి ఘటనకు సంబంధించి దర్యాప్తు సంస్థ ఆయుధాల చట్టం పరిధిలో పోలీసు కేసును నమోదు చేసింది.

భూముల కబ్జా కేసుకు సంబంధించి ఇప్పటికే సిఎం సోరెన్ , ఐఎఎస్ అధికారులు, రాంచీ డిప్యూటీ కమిషనర్ ఇతరులు సహా పాతిక మందికి పైగా ఇప్పటికే ఇడి అరెస్టు చేయడం వారు జైలు పాలు కావడం జరిగింది. తనపై వచ్చిన అభియోగాలను సోరెన్ తోసిపుచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తనపై రాజకీయ కుట్రకు దిగి, వేధింపులకు గురిచేసే క్రమంలో ఇడిని ఉసికొల్పిందని ఆయన విమర్శిస్తున్నారు. ఆరోపణల క్రమంలో సిఎం పదవికి సోరెన్ రాజీనామా చేసిన క్షణాల వ్యవధిలోనే జనవరి 31న ఆయనను అరెస్టు చేశారు. జైలుకు పంపించారు.



from Mana Telangana https://ift.tt/e7hDjRV

Post a Comment

Previous Post Next Post

Below Post Ad