పిఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల

PM Kisan Funds Released

వారణాసి: గంగామాత తనను దత్తత తీసుకున్నట్లుగా కనపడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వరుసగా మూడవసారి తనను ఎన్నుకున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గాన్ని ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తొలిసారి మంగళవారం సందర్శించారు. దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి చెందిన 17వ వాయిదా కింద రూ.20,000 కోట్లను మంగళవారం నాడిక్కడ కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో ప్రధాని మోడీ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారణాసి ప్రజలు తనను వరుసగా మూడవసారి ఎంపీగానే కాక ప్రధానిగా ఎన్నుకున్నారని తెలిపారు. 2019 ఎన్నికలలో 4.8 లక్షల మె జారిటీతో రెండవసారి వారణాసి నుంచి గెలుపొందిన మోడీ 2024 ఎన్నికలలో ఇక్కడి నుంచి1,52,513 ఓట్ల ఆధిక్యతతతో గెలుపొందారు. ఈ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీ ర్పు అనూహ్యమైందని మోడీ అన్నారు.



from Mana Telangana https://ift.tt/YDToguK

Post a Comment

Previous Post Next Post

Below Post Ad