హిందువులందరికీ బక్రీద్ రోజు ‘బ్లాక్ డే’:ఎంఎల్ఎ రాజాసింగ్

Raja Singh

బక్రీద్ పండగ రోజున బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ట్వీట్ చేశారు. ఆవును తల్లిగా భావించే హిందూవులందరికీ సోమవారం ‘బ్లాక్ డే’ అని రాజాసింగ్ సోమవారం ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా ‘ఆవుకు రొట్టెలు తినిపించే వారు, రొట్టెతో ఆవును తినే వారు ఎప్పటికి సోదరులు కాలేరని వ్యాఖ్యానించారు. బక్రీద్ సందర్భంగా రాజాసింగ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. మెదక్‌లో హిందువులు, గోరక్ష కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని రాజాసింగ్ ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అక్రమంగా గోవులను తరలిస్తే, పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయాల్సి ఉందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో హిందువులపై దౌర్జన్యాలు, దాడులు పెరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. కానీ, గోమాతలను తరలిస్తున్నారని సమాచారం ఇచ్చిన హిందువులపై అక్రమ కేసులు బనాయించి, దాడులు చేస్తే ఇక నుంచి ఏమాత్రం ఊరుకునేది లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. అంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఫ్రిడ్జ్‌లో బీఫ్ ఉందనే కారణంతో 11 ఇళ్లను బుల్డోజ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తర్వాత అన్యాయమనే చక్రం ఆగడం లేదని పేర్కొన్నారు.



from Mana Telangana https://ift.tt/ek1MBms

Post a Comment

Previous Post Next Post

Below Post Ad