మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న బండి సంజయ్‌ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి తన నివాసానికి తోడ్కోని వెళ్లారు. బండి సంజయ్‌కు శాలువా కప్పి సత్కరించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. “సంజయ్ గారు మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు, మీరు మంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అగ్రెసివ్ మెంటాలిటికి తగిన పోస్ట్ లభించిందని” చిరంజీవి అభినందించారు

. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ తమను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిందని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. బండి సంజయ్ స్పందిస్తూ ‘నేను విద్యార్ధి దశలో మీ సినిమాలకు అభిమానినని” పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఇరువురు దేశ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.



from Mana Telangana https://ift.tt/1aJ239C

Post a Comment

Previous Post Next Post

Below Post Ad