వెంటపడి వేధించి యువతిని చేశాడు

ప్రపంచం అంతా నిండా మహామోసం అయిపోతా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 20 ఏళ్ల యువకుడిని యువతిని చేసేశారు. తనకు తెలియకుండానే , తన సమ్మతి లేకుండానే స్థానిక ఆసుపత్రిలో లింగ మార్పిడి ఆపరేషన్ చేశారని, ఇప్పుడు తాను ఆడదాన్ని అయిపొయ్యానని ఈ మాజీ యువకుడు వాపోతున్నాడు. తనకు తెలియకుండా తనకు జరిగిన ఘోరమైన ఒళ్లు జలదరించే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనను ఎప్పుడూ ఓమ్ ప్రకాశ్ అనే వ్యక్తి గేలిచేస్తూ ఉండేవాడని, ఈ వ్యక్తే తన జీవితంలో నిప్పులు పోశాడని ఈ బాధిత జీవి పోలీసులకు తెలిపారు. ఈ నెల 3న ఓమ్ ప్రకాశ్ తనకు మాయమాటలు చెప్పి ఆసుపత్రికి తీసుకువెళ్లాడని,

తరువాత తనకు మత్తుమందు ఇప్పించి సెక్స్‌మార్పిడి ఆపరేషన్ చేయించాడని ఈ వ్యక్తి ఆరోపించారు. మరుసటి రోజు తనకు జరిగిన లోపాతిలోపం గురించి తెలిసివచ్చిందన్నారు. తాను ఇప్పుడు ఆడపిల్లను అయ్యానని , లక్నోకు తీసుకువెళ్లి పెళ్లి చేసుకుంటానని ఓమ్ ప్రకాశ్ వెంటపడుతున్నాడని , లేకపోతే తండ్రిని చంపేస్తానని బెదిరించాడని ఇప్పుడు యువతి అయిన యువకుడు తెలిపింది, తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రెండు రోజుల క్రితం పోలీసులు ఓమ్ ప్రకాశ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. అక్రమంగా ఆపరేషన్‌కు దిగిన ఆసుపత్రి వద్ద భారతీయ కిసాన్ సంఘం కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఇక్కడి డాక్టర్లు అక్రమ అవయవ వ్యాపారాలు చేస్తున్నారని స్థానిక రైతు నేత శ్యామ్ పాల్ మండిపడ్డారు.



from Mana Telangana https://ift.tt/PIqOvEA

Post a Comment

Previous Post Next Post

Below Post Ad