India Vs Pakistan Asia Cup: జడ్డూ బౌలింగ్ అంటే అంతే..పాపం పాక్ బ్యాటర్ రక్తం చిందించాడు

India Vs Pakistan Asia Cup

India Vs Pakistan Asia Cup: బంతిని మెలికలు తిప్పి.. బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టించడం అంటే భారత స్పిన్ బౌలర్ రవీంద్ర జడేజాకు మహా ఇష్టం. నిర్జీవమైన మైదానంపై కూడా బంతిని రకరకాలుగా సంధిస్తూ ఎదుట ఎంతటి తోపు బ్యాట్స్ మెన్ ఉన్నా రెప్పపాటు సమయంలోనే అవుట్ చేయగలడు. తనదైన రోజు మ్యాచ్ ఫలితాన్ని శాసించగలడు. ఎంతటి బలమైన బ్యాట్స్ మెన్ ఉన్నప్పటికీ బంతులతో చుక్కలు చూపించగలడు. అటువంటి రవీంద్ర జడేజా ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకలో సోమవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తన బౌలింగ్ విశ్వరూపం చూపించాడు. పాక్ బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించాడు. గింగిరాలు తిప్పే బంతివేసి పాకిస్తాన్ జట్టు బ్యాట్స్ మెన్ రక్తం చిందించేలా చేశాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆసియా కప్ లో భాగంగా శ్రీలంక వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 356 పరుగులు చేసింది.. రోహిత్ (56), గిల్(58) రాణించారు. విరాట్ కోహ్లీ (122), కే ఎల్ రాహుల్(111) వీరోచిత బ్యాటింగ్ చేశారు. కడ వరకూ అడి నాట్ అవుట్ గా నిలిచారు.

తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇక అప్పటినుంచి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ పరుగులు తీయలేక చేతులెత్తేశారు. అయితే ఈ మ్యాచ్ మొత్తంలో రవీంద్ర జడేజా వేసిన బంతి హైలెట్ గా నిలిచింది. 20 వ ఓవర్ లో జడేజా బంతులు వేయడం ప్రారంభించాడు. స్ట్రైకర్ గా అఘా సల్మాన్ ఉన్నాడు. స్పిన్ బౌలింగ్ మాత్రమే అనుకొని హెల్మెట్ లేకుండా బ్యాట్ చేత పట్టాడు. అప్పటికి పాకిస్తాన్ స్కోరు 83/4 వద్ద ఉంది. అయితే జడేజా బంతి వేయగా.. దానిని సల్మాన్ తప్పుగా అంచనా వేశాడు. గింగిరాలు తిరిగిన బంతి అతడి ముక్కును గిరాటేసింది. చాలామంది అది తక్కువ దెబ్బే అనుకున్నారు. రక్తం కారితే గాని తెలియ రాలేదు దాని తీవ్రత.. దీంతో సల్మాన్ చాలాసేపు ఇబ్బంది పడ్డారు.. భారత క్రీడాకారులు అతడిని పరామర్శించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ” స్పిన్ బౌలింగ్ కాదు సల్మాన్.. అవి బుల్లెట్ బంతులు.. హెల్మెట్ పెట్టుకోవాలి కదా” అని నెటిజన్లు ఆ వీడియోని చూసి వ్యాఖ్యలు చేశారు.



source https://oktelugu.com/ind-vs-pak-asia-cup-2023-agha-salman-leaves-with-bloodied-face-after-suffering-ugly-injury-off-jadejas-bowling/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad