
Bigg Boss 7 Telugu Nominations: సోమవారం వచ్చిందంటే హౌస్ సీరియస్ గా మారిపోతుంది. కంటెస్టెంట్స్ మధ్య వాడివేడి చర్చ నడుస్తుంది. ఆదివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా నిన్నటి ఎపిసోడ్లో నెక్స్ట్ వీక్ కి నామినేషన్స్ మొదలయ్యాయి. గత సీజన్ కి భిన్నంగా ఎలిమినేషన్స్ నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ప్రతి కంటెస్టెంట్స్ ఇద్దరిని కారణాలు చెప్పి నామినేట్ చేస్తే సరిపోయేది. ఈ సీజన్లో ఒక కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలనుకుంటున్నవారందరూ నామినేట్ చేయాలని అనుకుంటున్నారు.
పవర్ అస్త్ర గెలిచిన ఆట సందీప్ ఎలిమినేషన్ నుండి మినహాయింపు పొందారు. ఐదు వారాలు సందీప్ ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. అదే సమయంలో ఆట సందీప్ ఈ వారానికి ఒకరిని నేరుగా నామినేట్ చేయవచ్చు. ప్రిన్స్ యావర్ ని ఆట సందీప్ నామినేట్ చేశాడు. అనంతరం టేస్టీ తేజాను నామినేట్ చేయాలనుకుంటున్నవారు ఎవరని బిగ్ బాస్ అడిగారు. శుభశ్రీ, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్… తేజాను నామినేట్ చేశాడు. తేజా పని చేయడం లేదు. తిని రెస్ట్ తీసుకుంటున్నాడని రతికా రోజ్ ఆరోపణలు చేసింది.
దీంతో తేజా-రతికా మధ్య వాగ్వాదం నడిచింది. తర్వాత దామిని పేరు వచ్చింది. దామినిని ఎవరూ నామినేట్ చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో ఆమె ఈ వారం నామినేషన్స్ నుండి తప్పుకుంది. ఇక శివాజీ వంతు వచ్చింది. ఆయన్ని అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, షకీలా, శోభా శెట్టి, దామిని నామినేట్ చేశారు. శివాజీ-ప్రియాంక మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చూస్తుంటే ఈ వారం శివాజీ నామినేట్ కానున్నారనిపిస్తుంది.
తర్వాత పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. గౌతమ్ కృష్ణ, తేజా, ప్రియాంక, షకీలా, అమర్ దీప్ చౌదరి అతన్ని నామినేట్ చేశాడు. అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ మధ్య వాగ్వాదం నడిచింది. రైతుబిడ్డ అనే సెంటిమెంట్ వాడొద్దని అమర్ దీప్ హెచ్చరించాడు. నేను చేసే పని చెప్పుకుంటే తప్పేంటి అని పల్లవి ప్రశాంత్ ఎదురు ప్రశ్నించాడు. రైతు బిడ్డను అని చెప్పుకుంటూ సింపతీ పొందే ప్రయత్నం చేస్తున్నావు. రైతులే కాదు ఇంజనీర్స్ కూడా కష్టాలు పడుతున్నారు. ప్రతి రంగంలో కష్టాలు ఉన్నాయని అమర్ దీప్ పాయింట్ లేవనెత్తాడు.
పల్లవి ప్రశాంత్ కి రైతుబిడ్డ అనే ట్యాగ్ దూరం చేయడమే లక్ష్యంగా అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, ఆట సందీప్ మాట్లాడారు. రైతుబిడ్డ, కామనర్ అనే కారణంగా పల్లవి ప్రశాంత్ విపరీతమైన ఆదరణ లభిస్తుంది. గత వారం పల్లవి ప్రశాంత్ తో పాటు 8 మంది నామినేషన్స్ లో ఉండగా %40 ఓట్లు అతనొక్కడికే పడ్డాయని సమాచారం. పల్లవి ప్రశాంత్ కి రైతుబిడ్డ ట్యాగ్ దూరం చేయకపోతే అసలుకే ప్రమాదం అని టాప్ కంటెస్టెంట్స్ స్కెచ్ వేశారనిపిస్తుంది. ఇక మంగళవారం కూడా నామినేషన్స్ ప్రక్రియ జరగనుంది. నేటి ఎపిసోడ్ తో నామినేషన్స్ లో ఎవరు ఉన్నారో క్లారిటీ వస్తుంది.
source https://oktelugu.com/bigg-boss-7-telugu-nominations-highlights/