
India Vs Pakistan Asia Cup 2023: ఇండియా పాకిస్తాన్ కి మధ్య జరిగే మ్యాచ్ లో ఇండియా విజయం సాధించాలంటే ఒక్కటే మార్గం నిన్న సగం మ్యాచ్ ఆడిన తర్వాత ఇవాళ్ళ మిగిలిన మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి నిన్న ఎలాగైతే బ్యాటింగ్ చేశారో ఇవాళ్ళ కూడా అలాగే మన ఇండియా టీమ్ బ్యాటింగ్ చేయాలి మనవాళ్ళు మొత్తం 50 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 300 ప్లస్ రన్స్ చేయగలిగితే ఈ మ్యాచ్ లో మనం ఈజీగా గెలవచ్చు. సగం ఓవర్లు పూర్తి అయ్యేసరికి 147 పరుగులు చేశారు ఇంకో సగం ఓవర్లకి ఇంకో 150 కనక కొడితే ఈజీగా మన మ్యాచ్ మన చేతుల్లోనే ఉంటుంది…ముందుగా కోహ్లీ, రాహుల్ చాలా బాగా ఆడితే ఆ తర్వాత వచ్చే ప్లేయర్లు కూడా ఏ టెన్షన్ లేకుండా చాలా ఫ్రీ గా ఆడగలుగుతారు.అయిన ఈ వర్షం ఎందుకు ఈ మ్యాచ్ లకి అడ్డంకి గా ఇలా తయారైందో తెలియడం లేదు.నిజానికి ఈ మ్యాచ్ లో ఇండియా తప్పకుండా గెలవాలి మన టీమ్ ఫైనల్ కి వెళ్ళాలి అంటే ఈ మ్యాచ్ మనకు చాలా ముఖ్యం పాకిస్థాన్ టీమ్ ఇప్పటికే సూపర్ ఫోర్ లో బంగ్లాదేశ్ మీద గెలిచింది.
కాబట్టి మనవాళ్ళు ఈ మ్యాచ్ ని గేలిస్తెనే ఏ ప్రాబ్లం లేకుండా ఫైనల్ కి వెళ్తారు లేకపోతే శ్రీలంక మీదగాని బంగ్లాదేశ్ మీద గాని మ్యాచ్ ఆడేటప్పుడు వర్షం పడి మ్యాచ్ రద్దైతే మనకు చాలా ఇబ్బది అవుతుంది అందుకే మన టీమ్ ఇప్పుడు ఫైనల్ కి వెళ్ళాలంటే ఈ ఒక్క మ్యాచ్ పక్క గా గెలవాలి లేకపోతే మన టీమ్ అసలు ఫైనల్ కి వెళ్లదు కాబట్టి ఈ మ్యాచ్ మనకు చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి… అయితే ఈ మ్యాచ్ లో మనం గెలవాలంటే మాత్రం బ్యాట్స్ మెన్స్ తో పాటుగా బౌలర్లు కూడా చాలా కీలకంగా మారనున్నారు అనే విషయం తెలుస్తుంది…
మనం ఈ మ్యాచ్ లో గెలవాలంటే మనం 300 ప్లస్ స్కోర్ చేసి బౌలింగ్ సూపర్ గా వేసి వాళ్ల బ్యాట్స్ మెన్స్ అయిన మొదటి నలుగురి ని తొందరగా ఔట్ చేస్తే ఈ మ్యాచ్ మనదే అవుతుంది…ఇలా చేయాలంటే మనవాళ్ళు ముందుగా మూడు వందల పైన స్కోర్ అయితే చేయాలి…ఇక బౌలింగ్ లో జస్ప్రిత్ బుమ్రా, సిరజ్ లు కిలకం కానున్నారు ఇక ఈ రోజు మొత్తం మ్యాచ్ లో ఇషాన్ కిషన్,రవీంద్ర జడేజా,హర్ధిక్ పాండ్య లు చాలా కీలకంగా మారనున్నారు…
source https://oktelugu.com/india-vs-pakistan-asia-cup-2023-if-india-wants-to-win-this-match-they-have-to-do-this/