
India vs Sri Lanka Asia Cup 2023: ఈరోజు జరిగిన ఇండియా శ్రీలంక మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించడం జరిగింది ఈ మ్యాచ్ లో మొదట ఇండియా బ్యాటింగ్ చేసింది అయితే ఓపెనర్లు అయిన రోహిత్ శర్మ, గిల్ ఇద్దరు కూడా మంచి ఓపెనింగ్ అయితే ఇచ్చారు. అయితే శ్రీలంక స్పిన్నర్ అయిన దునిత్ వెల్లలాగే తన స్పిన్ మ్యాజిక్ తో మన ఓపెనర్లు అయినా గిల్, రోహిత్ శర్మ లను అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా లాంటి బ్యాట్స్ మెన్స్ ని అవుట్ చేసి ఇండియా ఎక్కువ స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో వెల్లలాగే చాలా వరకు సక్సెస్ అయ్యాడు. 20 సంవత్సరాల ఈ కుర్రాడు ఇండియాలో క్రికెట్ దిగ్గజాలుగా గుర్తించబడిన రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ ,హార్దిక్ పాండ్యా , కేఎల్ రాహుల్ , గిల్ లాంటి ఐదుగురు బెస్ట్ బ్యాట్స్ మెన్స్ వికెట్లు తీసి ఒక మంచి రికార్డుని క్రియేట్ చేశారని చెప్పాలి.
ఈయన వేసిన బంతులను ఎదుర్కోవడానికి మన టీం ప్లేయర్లు చాలా వరకు ఇబ్బంది పడ్డారు ఆయన స్పిన్ బౌలింగ్ ఎలా వేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఆయన్ని చూస్తుంటే ఒకప్పటి శ్రీలంక స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్ ఎలాగైతే తన స్పిన్ మ్యాజిక్ తో అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడో అలాగే వెల్లలాగే కూడా తన బాల్స్ తో ప్రత్యర్థులను చాలావరకు కట్టడి చేస్తున్నాడు అయితే వెల్లలాగే బౌలింగ్ లోనే కాకుండా బ్యాటింగ్ లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు 46 బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్ కొట్టి 42 పరుగులు చేసిన ఆటగాడుగా నిలిచాడు.ఆయనతోపాటు ఎవరైనా ఒక ప్లేయర్ ఆయనకి సపోర్ట్ చేసి ఉంటే ఈ మ్యాచ్ ని ఈజీగా గెలిపించేవాడు ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీయడమే కాకుండా 41 పరుగులను కూడా చేశాడు.ఇక ఫైనల్ గా ఇండియా శ్రీలంక మీద విజయాన్ని అందుకుంది ఇదంతా ఒకే ఎత్తు అయితే ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా దునిత్ వెల్లలాగేకి మంచి ఫ్యాన్స్ అయ్యారనే చెప్పాలి. ఒక 20 సంవత్సరాల కుర్రాడు ఇలా బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను అదరగొట్టడం చూసిన ఇండియన్ అభిమానులు కూడా అతని ప్రతిభని మెచ్చుకుంటున్నారు. ఇక బౌలింగ్ లో ఐదు వికెట్లు తీసి బ్యాటింగ్ లో 42 పరుగులు చేసినప్పటికీ శ్రీలంక టీం ఓడిపోవడం ఆయనకు బాగా బాధని కలిగించే విషయం అనే చెప్పాలి ఒక మ్యాచ్ ఓడిపోయిన కూడా చివరి వరకు ఒంటరి పోరాటం చేసినందుకుగాను ఆయన్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిర్ణయించారు… అతను ఇలాగే ఆడితే ఆయనకు భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది…
source https://oktelugu.com/india-vs-sri-lanka-asia-cup-2023-india-beat-sri-lanka-by-41-runs-to-reach-the-final/