
అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ప్రతికూల పరిస్థితుల మధ్య కొనసాగుతున్నాయి. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1942.8 డాలర్ల వద్ద ఉండగా నిన్న 1942.69 డాలర్ల వద్ద కొనసాగింది. దీంతో దేశీయంగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,150 ఉండగా ఇవాళ స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ. 60,160 ఉండగా ఇవాళ కూడా అదే ధర కొనసాగుతుంది. స్థిరంగా ఉంది కాబట్టి ఇవాళ కొనడం మంచిదే అని భావిస్తున్నారా? ఈరోజు కొనడం మంచిదే.. అయితే రేపు కొనడం ఇంకా మంచిది.
ఎందుకంటే బంగారం ధరలు తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్ నిన్నటితో పోలిస్తే 10 డాలర్ల మేర పడిపోయింది. నిన్న ఉదయం ఇదే సమయానికి గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1942.69 డాలర్లు ఉండగా.. ఇవాళ ఉదయానికి 1934 డాలర్లకు పడిపోయింది. ఈ కారణంగా దేశీయంగా బంగారం ధరలు తగ్గనున్నాయి. బంగారం కొనాలనుకునేవారు ఒకరోజు ఆగి కొనడం వల్ల డబ్బులు ఆదా అవుతాయి. అయితే దేశీయంగా వెండి ధర కాస్త తగ్గింది. నిన్న హైదరాబాద్ లో కిలో వెండి రూ. 78,500 ఉండగా ఇవాళ రూ. 200 తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 78,300 వద్ద కొనసాగుతుంది.
మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి 23.63 డాలర్లు ఉండగా.. నిన్న 23.59 డాలర్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా వెండి ధర తగ్గింది. రేపు కూడా తగ్గే అవకాశం ఉంది. అది కూడా భారీగా తగ్గనుంది. ఎందుకంటే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి 23.18 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్న 23.59 డాలర్ల వద్ద ఉన్న వెండి ఇవాళ 0.41 డాలర్ల మేర పడిపోయింది. కాబట్టి ఇవాళ కొనడం కంటే రేపు కొనడం మంచిది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గిన కారణంగా రేపు దేశీయంగా తగ్గనున్నాయి.
ఆగస్టు 8న 22 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 5,515 ( ₹ 0 )
- 8 గ్రాములు: ₹ 44,120 ( ₹ 0 )
- 10 గ్రాములు: ₹ 55,150 ( ₹ 0 )
- 100 గ్రాములు: ₹ 5,51,500 ( ₹ 0 )
ఆగస్టు 8న 24 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 6,016 ( ₹ 0 )
- 8 గ్రాములు: ₹ 48,128 ( ₹ 0 )
- 10 గ్రాములు: ₹ 60,160 ( ₹ 0 )
- 100 గ్రాములు: ₹ 6,01,600 ( ₹ 0 )
ఆగస్టు 8న వెండి ధరలు:
- 1 గ్రాము: ₹78.30 ( ₹ -0.20)
- 8 గ్రాములు: ₹ 626.40 ( ₹ -1.60 )
- 10 గ్రాములు: ₹ 783 ( ₹ -2 )
- 100 గ్రాములు: ₹ 7,830 ( ₹ -20 )
- 1000 గ్రాములు: ₹ 78,300 ( ₹ -200 )
from SumanTV https://ift.tt/dM6Ugco