Ileana: ఎట్టకేలకు ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయింది!

Ileana

Ileana: హీరోయిన్ ఇలియానా తల్లయ్యింది. ఆగస్టు 1న ఇలియానా అబ్బాయి పుట్టినట్లు వెల్లడించింది. ఇక కొడుకు పేరు కూడా రివీల్ చేసింది. కోయా ఫీనిక్స్ డోలన్ అని నామకరణం చేసింది. ఇది పూర్తిగా విదేశీయుల పేరును పోలి ఉంది. ఇలియానాను అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. అబ్బాయి చాలా క్యూట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అంతా బాగున్నా… ఒక మిస్టరీ మాత్రం కొనసాగుతూనే ఉంది. అసలు ఇలియానా ప్రియుడు ఎవరు? అతని వివరాలు ఏమిటీ? ఇలియానా అతన్ని పెళ్లి చేసుకుందా? ఇంకా సహజీవనమే చేస్తున్నారా? వంటి అనేక సందేహాలు ఉన్నాయి.

ఎట్టకేలకు కొంత సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఇలియానా ప్రియుడు పేరు మైఖేల్ డోలన్. ఇతడు విదేశీయుడు. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇలియానా గర్భం దాల్చాక పెళ్లి చేసుకున్నారట. 2023 మే 13న ఇలియానా-మైఖేల్ డోలన్ వివాహం నిరాడంబరంగా జరిగిందని సమాచారం. మైఖేల్ వృత్తి ఏమిటీ? అతను ఏ దేశస్థుడు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ మేరకు సమాచారం అందుతుంది.

ఇలియానా ఏప్రిల్ 18న గర్భవతి అయిన విషయం తెలియజేశారు. ఇంస్టాగ్రామ్ వేదికగా తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ న్యూస్ అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఇలియానా తల్లిని చేసిన వ్యక్తి ఎవరనే సస్పెన్సు కొనసాగింది. కొన్నాళ్లకు అతని ఫేస్ రివీల్ చేసింది. వివరాలు మాత్రం చెప్పలేదు. కనీసం అతని పేరు కూడా మెన్షన్ చేయలేదు. గతంలో కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ పేరు తెరపైకి వచ్చింది. అతడు కాదని తేలిపోయింది.

కాగా కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ని ప్రేమించింది. 2019లో వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ డిప్రెషన్ నుండి బయటపడేందుకు ఇలియానాకు చాలా సమయం పట్టింది. తాజాగా మైఖేల్ డోలన్ ని భర్తగా చేసుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఒక ఇలియానా కెరీర్ మొదలైంది తెలుగులోనే. దేవదాసు మూవీతో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. రెండో చిత్రం పోకిరి తో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అయ్యింది.



source https://oktelugu.com/ileanas-boyfriend-is-finally-known/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad