Kalki 2898: ప్రభాస్ తో తలపడేందుకు సిద్దమవుతున్న కమల్… కల్కి నుండి క్రేజీ అప్డేట్

Kalki 2898

Kalki 2898: ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు కల్కి 2898 AD కోసం ఎదురుచూస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియా లోని గొప్ప నటులు గా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటీనటులు నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న ఈ సినిమా ను మెగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విలక్షణ నటుడు కమల్ హాసన్ ను ఒప్పించి మరి ఈ ప్రాజెక్టు లోకి తీసుకొని వచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కమల్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లో నటించబోతున్నాడు అనే విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు కమల్ హాసన్ ఈ సినిమా షూట్ లో భాగంగా కాలేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అతి త్వరలో ఈ సినిమా యూనిట్ తో కలిసే అవకాశం ఉంది.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు 2 లో నటిస్తున్న కమల్ హాసన్ ఆ సినిమాకు కొంచెం గ్యాప్ ఇచ్చి కల్కి కి డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్ లతో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించే అవకాశం ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు సినిమా మొత్తానికి హైలెట్ అయ్యే అవకాశం ఉండటంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ షెడ్యూల్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన చిన్నపాటి టీజర్ తో ఈ సినిమా అంచనాలను అమాంతం పెంచిన విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గని విధంగా సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చాడు దర్శకుడు. భారతీయ సినిమా ను మరో మెట్టు ఎక్కించే చిత్రంగా కల్కి ఉండబోతుందనేది చిత్ర యూనిట్ నమ్మకం. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాను దించాలని చూస్తున్నారు. కాకపోతే షూటింగ్ పెండింగ్ ఉంది. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పెండింగ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి, డిసెంబర్ చివరి నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.



source https://oktelugu.com/kamal-getting-ready-to-face-prabhas-crazy-update-from-kalki/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad