
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పతనమవుతుంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, డాలర్ పుంజుకోవడం వల్ల పెట్టుబడిదారులు బాండ్ ఈల్డ్స్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారం, వెండి మీద ఉన్న పెట్టుబడులను బాండ్ ఈల్డ్స్ వైపు మళ్లిస్తున్నారు. ఈ కారణంగా గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుతున్నాయి. దేశీయంగా కూడా తగ్గుతున్నాయి. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1925 డాలర్ల వద్ద ఉండగా.. నిన్న ఉదయం 1918.88 డాలర్ల వద్ద కొనసాగింది. దీంతో దేశీయంగా పసిడి ధరలు దిగొచ్చాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,950 ఉండగా.. ఇవాళ రూ. 250 పడిపోయింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 54,700 వద్ద కొనసాగుతుంది.
ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం హైదరాబాద్ మార్కెట్లో రూ. 59,950 వద్ద కొనసాగగా.. ఇవాళ రూ. 280 తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రూ. 59,670 వద్ద కొనసాగుతుంది. వెండి ధర విషయానికొస్తే అంతర్జాతీయంగా ఔన్స్ స్పాట్ మొన్న 22.77 డాలర్ల వద్ద ఉండగా నిన్న రూ. 22.71 డాలర్ల వద్ద కొనసాగింది. దీంతో దేశీయంగా వెండి ధర పతనమైంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 76,700 ఉండగా ఇవాళ రూ. 500 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్ లో రూ. 76,200 వద్ద కొనసాగుతుంది. మరి ఇప్పుడే కొనేసుకుంటే మంచిదేమో అని అనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే వెండి కొనాలనుకుంటే కొనేసుకోవచ్చు.
ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం వెండి సానుకూలంగా సాగుతుంది. రేపు ఈ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఔన్స్ స్పాట్ వెండి గ్లోబల్ మార్కెట్లో 22.76 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్నటి మీద పోలిస్తే 0.05 డాలర్లు పెరిగింది. కాబట్టి రేపు ఈ ధర పెరుగుతుంది. అందుకే ఇవాళ కొనుక్కోవడం మంచిది. అయితే బంగారం మాత్రం ఇవాళ కొనకపోవడమే మంచిది. ఎందుకంటే బంగారం మరింత తగ్గే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అంటే ఉదయం 8 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1914.52 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే 4.36 డాలర్ల మేర తగ్గింది. కాబట్టి దేశీయంగా రేపు బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. కొనాలా వద్దా అనేది రేపు గ్లోబల్ గా లైవ్ గోల్డ్ ధర ఎలా ఉందో అనే దాని మీద ఆధారపడి నిర్ణయం తీసుకుంటే మంచిది.
ఆగస్టు 11న 22 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 5,470 ( ₹ -25 )
- 8 గ్రాములు: ₹ 43,760 ( ₹ -200 )
- 10 గ్రాములు: ₹ 54,700 ( ₹ -250 )
- 100 గ్రాములు: ₹ 5,47,000 ( ₹ -2500 )
ఆగస్టు 11న 24 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 5,967 ( ₹ -28 )
- 8 గ్రాములు: ₹ 47,736 ( ₹ -224 )
- 10 గ్రాములు: ₹ 59,670 ( ₹ -280 )
- 100 గ్రాములు: ₹ 5,96,700 ( ₹ -2800 )
ఆగస్టు 11న వెండి ధరలు:
- 1 గ్రాము: ₹76.20 ( ₹ -0.50 )
- 8 గ్రాములు: ₹ 609.60 ( ₹ -4 )
- 10 గ్రాములు: ₹ 762 ( ₹ -5 )
- 100 గ్రాములు: ₹ 7,620 ( ₹ -50 )
- 1000 గ్రాములు: ₹ 76,200 ( ₹ -500 )
from SumanTV https://ift.tt/OsCvF62