Bhola Shankar Twitter Review: భోళా శంకర్ ట్విట్టర్ రివ్యూ: సినిమా హిట్టా ఫట్టా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

Bhola Shankar Twitter Review

Bhola Shankar Twitter Review: బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో చిరంజీవి హోరెత్తిస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ భోళా శంకర్. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించగా తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ కీలక రోల్ చేసింది. అర్థరాత్రి నుండి భోళా శంకర్ ప్రీమియర్స్ మొదలయ్యాయి. దీంతో ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ మూవీపై తన అభిప్రాయం తెలియజేస్తున్నారు.

భోళా శంకర్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. కలకత్తా నేపథ్యంలో నడిచే చెల్లెల్లు సెంటిమెంట్ తో కూడిన కథ. 2015లో అజిత్ హీరోగా వేదాళం టైటిల్ తో విడుదలైన చిత్రానికి భోళా శంకర్ అధికారిక రీమేక్. ఒరిజినల్ కి శివ దర్శకత్వం వహించారు. ఈ కథ చిరంజీవి ఇమేజ్ కి చక్కగా సరిపోతుంది. మరి మెహర్ రమేష్ తెలుగు ఆడియన్స్ ని మెప్పించేలా తెరకెక్కించాడా?

దర్శకుడు మెహర్ రమేష్ దాదాపు పదేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టాడు. చిరంజీవి వంటి బడా స్టార్ ని ఒప్పించి రీమేక్ చేశారు. గతంలో కూడా మెహర్ రమేష్ స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించారు. ఆయనకు విజయాలు దక్కలేదు. భోళా శంకర్ తో గ్రాండ్ గా కమ్ బ్యాక్ కావాలని అనుకుంటున్నారు. ఆడియన్స్ అభిప్రాయంలో మెహర్ రమేష్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆయన మేకింగ్ అవుట్ డేటెడ్ గా ఉంది. ఇంకా ఇరవై ఏళ్ల క్రితం మేకింగ్ స్టైల్ ఫాలో అవుతున్నారు.

భోళా శంకర్ ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుడికి పరీక్ష అంటున్నారు. కామెడీ, రొమాన్స్ వర్క్ అవుట్ కాలేదంటున్నారు. చిరంజీవి ప్రెజెన్స్, ఆయన మేనరిజమ్స్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ లో ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మహతి స్వర సాగర్ అందించిన సాంగ్స్ పర్లేదు.

మొత్తంగా భోళా శంకర్ మూవీ చూసిన ప్రేక్షకుల అభిప్రాయంలో మెహర్ రమేష్ మరికొంత ఎఫర్ట్స్ పెట్టాల్సింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఆయన కొంచెం బెటర్ గా తీర్చిదిద్ది ఉంటే ఫలితం బాగుండేది. సెకండ్ హాఫ్ విషయంలో ఆయనకు పాస్ మార్క్స్ పడుతున్నాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం నిరాశపరిచాడని అంటున్నారు. ఇక పూర్తి రివ్యూ వస్తే కానీ భోళా శంకర్ ఫలితం ఏమిటో తెలియదు….



source https://oktelugu.com/bhola-shankar-twitter-review-in-telugu/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad