గుడ్ న్యూస్.. వారికి వారం రోజుల్లో లక్ష రూపాయల చెక్కులు అందజేత!

one-lakh-cheques-for-bc

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రైతు బీమా పథకం, రైతు బంధు, ఆరోగ్య లక్ష్మి, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు మొదలైనవి ప్రవేశ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా పథకాలను ప్రభుత్వం అమలు పరుస్తుంది. సంక్షేమ పథకాల్లో భాగంగా తాజాగా బీసీ కులవృత్తుల చేయూత పథకం కింద కుల వృత్తులు చేసుకునేవారికి రూ. లక్ష రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించారు. దీనికి అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

బీసీ కులవృత్తుల చేయూత పథకం కింద ప్రభుత్వం చెల్లించవలసిన రూ. లక్ష చెక్కులను వారం రోజుల్లోగా చెల్లించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో ఈనెల 15 తేదీలోపు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుకోవాలని బీసీ సంక్షేమ, సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీసీ కులవృత్తులకు చేయూత, గృహలక్ష్మి, దళితబంధు, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాలపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పథకాలను అమలు పరిచి లబ్ధిదారులకు పక్కాగా అందించాలని తెలిపారు.

సొంత స్థలం ఉండి ఇల్లు లేనివారికి ఇల్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3లక్షలు ప్రభుత్వం ఇవ్వనుంది. గృహలక్ష్మి పథకంపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకూడదని తెలిపారు. తెల్లకాగితంపై రాత పూర్వకంగా దరఖాస్తును, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీకార్డ్ తో కలిపి తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించగా, వారు కలెక్టర్ ఆఫీస్‌కు అందిస్తారని వెల్లడించారు. గ్రామకంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండకపోయినా నంబర్ వేసినా సరిపోతుందని చెప్పారు. రెండో విడత దళిత బంధు పథకం కింద నియోజకవర్గానికి 1,100 యూనిట్లను సాంక్షన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మైనార్టీ బంధుకు సంబంధించిన వివరాలను మరో రెండు రోజుల్లో వెల్లడిస్తామని మంత్రి గంగుల తెలిపారు.



from SumanTV https://ift.tt/TbwnvHd

Post a Comment

Previous Post Next Post

Below Post Ad