
Rashmika Mandanna: రష్మిక మందాన వ్యక్తిగత జీవితంపై అనేక పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా తరచుగా ఆమెను ఉద్దేశిస్తూ ఎఫైర్ కథనాలు వెలువడుతూ ఉంటాయి. రష్మిక కెరీర్ బిగినింగ్ లోనే ప్రేమలో పడ్డారు. తన మొదటి సినిమా కిరిక్ పార్టీ. ఈ కన్నడ చిత్రంలో రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. ఈ చిత్ర షూటింగ్ టైం లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్ళికి దారి తీసింది. నిశ్చితార్థం కూడా ముగిసింది. కొద్దిరోజుల్లో పెళ్లి అనగా రష్మిక మనసు మారింది. వివాహం చేసుకుంటే కెరీర్ ముగిసినట్లే అనుకుని క్యాన్సిల్ చేసుకుంది.
ఈ నిర్ణయం ఆమె మీద పెద్ద ఎత్తున వ్యతిరేకతకు కారణమైంది. రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఆ దెబ్బకు రష్మిక కన్నడ పరిశ్రమను వీడాల్సి వచ్చింది. అనూహ్యంగా తెలుగులో ఆమె సక్సెస్ అయ్యారు. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో ఆమె స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం ఆమె క్రేజ్ ఇండియా వైడ్ పాకింది. నేషనల్ క్రష్ గా అవతరించింది. టాలీవుడ్ లో అడుగుపెట్టాక హీరో విజయ్ దేవరకొండకు దగ్గరయ్యారనే వాదన ఉంది.
విజయ్ దేవరకొండతో రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో ఇద్దరి మధ్య ముద్దు ఘాటైన సన్నివేశాలు ఉన్నాయి. చాలా సహజంగా నటించి మెప్పించారు. తరచుగా ఇద్దరూ కలిసి చక్కర్లు కొడుతూ ఉంటారు. అప్పుడప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి వెళుతుంది. విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కూడా రష్మిక బాగా కలిసిపోయింది. అయితే మేము స్నేహితులం మాత్రమే అంటుంది.
ఇదిలా ఉంటే ఇటీవల ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న రష్మిక మందానకు ప్రేమ, పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి రష్మిక నరుటో తో నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు, అని ఫన్నీ కామెంట్ చేసింది. ఇంతకీ ఎవరీ నరుటో అంటే ఓ కామిక్ సిరీస్ లో క్యారెక్టర్. సదరు క్యారెక్టర్ తనకు ఎంతో ఇష్టమని రష్మిక చెప్పారు. ఇక తెలుగులో పుష్ప 2, హిందీలో యానిమల్ వంటి భారీ చిత్రాల్లో రష్మిక నటిస్తుంది.
source https://oktelugu.com/rashmika-mandana-made-interesting-comments-about-her-marriage/