బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

vaishnavi-chaitanya

బేబి సినిమాతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది వైష్ణవి చైతన్య. హీరోయిన్‌‌గా చేసింది ఒక్క సినిమానే.. అయిన దాని ఇంపాక్ట్ చాలా దూరం వెళ్లింది. బేబి చిత్రం భారీ విజయం సాధించడంతో సినీ జనాల కన్ను ఈమెపై పడింది. వైష్ణవి సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉంటూ.. రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌‌లో వచ్చిన ‘అల వైకుంఠపుములో’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ మూవీలో అల్లు అర్జున్ సిస్టర్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. దాని తర్వాత సాఫ్ట్‌‌‌వేర్ డెవలపర్ – వెబ్ సరీస్ చేసింది. అది కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో మరింత ఫేమ్ తెచ్చుకుంది.

ఇలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ.. వచ్చింది. హీరోయిన్‌‌‌గా ప్రయత్నించే క్రమంలో బేబి సినిమా అవకాశం రావడం, అది బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. వైష్ణవికి ఒక పెద్ద సినిమా నుండి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? ప్రస్తుతం పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో ‘డబుల్ ఇస్మార్డ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే, అందులో ఒక హీరోయిన్‌‌గా వైష్ణవిని అనుకుంటున్నారట పూరి జగన్నాథ్.

బేబి సినిమాలో వైష్ణవి నటనకి పూరి ఫిదా అయ్యారట. ఆ కారణంగానే ఆమెకి తన సినిమాలో పిలిచి మరీ ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పూరి చేతిలో పడితే ఏ హీరోయిన్ అయిన ఫేమ్ అవ్వాల్సిందే.  ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా హిట్ అయితే వైష్ణవి పెద్ద స్టార్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇక పూరి జగన్నాథ్ తన సినిమాల్లో హీరోయన్స్‌‌ని ఓ రేంజ్‌లో  చూపిస్తుంటారు. తనదైన మార్క్ డైలాగ్స్‌తో హీరోకి ఏ మాత్రం తగ్గకుండా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తారు. మరి వైష్ణవికి ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేస్తాడో చూడాలి.



from SumanTV https://ift.tt/vd4KT01

Post a Comment

Previous Post Next Post

Below Post Ad