
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పతనమయ్యింది. ప్రస్తుతం అక్కడ ఆర్థిక ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1964 డాలర్ల వద్ద ఉండగా.. నిన్న 1945 డాలర్లకు పతనమైంది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,400 ఉండగా ఇవాళ రూ. 300 తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రూ. 55,100 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల బంగారం నిన్న హైదరాబాద్ మార్కెట్లో రూ. 60,440 ఉండగా ఇవాళ పది గ్రాముల మీద రూ. 330 తగ్గింది.
దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 60,110 వద్ద కొనసాగుతోంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి మొన్న 24.72 డాలర్లు ఉండగా నిన్న 24.38 డాలర్లకు పతనమైంది. దీంతో దేశీయంగా ఇవాళ వెండి ధర పతనమైంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 81 వేలు ఉండగా.. ఇవాళ రూ. 700 తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి రూ. 80,300 వద్ద కొనసాగుతుంది. అయితే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ప్రతికూలంగా సాగుతున్నాయి. ప్రస్తుతం అంటే ఉదయం 8:05 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1937.91 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. స్పాట్ వెండి 23.76 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
గ్లోబల్ గా స్పాట్ గోల్డ్ నిన్నటితో పోలిస్తే ఇవాళ మరింత పతనమైంది. 8 డాలర్లు పతనమైంది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలపై ప్రభావం పడుతుంది. ఈ కారణంగా బంగారం ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉంది. అలానే వెండి కూడా మరింత పతనమైంది. దాదాపు ఒక డాలర్ మేర తగ్గింది. దీంతో దేశీయంగా వెండి ధర తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి బంగారం, వెండి కొనాలకునేవారికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఇవాళ తప్పదు కొనుక్కోవాల్సిందే అనుకునేవారు కొనుక్కోవచ్చు. లేదు ఒకరోజు ఆగినా పర్లేదు కొంపలు మునిగిపోవు అనుకునేవారు ఇవాళ ఒక్కరోజు ఆగి రేపు కొనడం వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది.
ఆగస్టు 3న క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 5,510 ( ₹ -30 )
- 8 గ్రాములు: ₹ 44,080 ( ₹ -240 )
- 10 గ్రాములు: ₹ 55,100 ( ₹ -300 )
- 100 గ్రాములు: ₹ 5,51,000 ( ₹ -3000 )
ఆగస్టు 3న 24 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 6,011 ( ₹ -33 )
- 8 గ్రాములు: ₹ 48,088 ( ₹ -264 )
- 10 గ్రాములు: ₹ 60,110 ( ₹ -330 )
- 100 గ్రాములు: ₹ 6,01,100 ( ₹ -3300 )
ఆగస్టు 3న వెండి ధరలు:
- 1 గ్రాము: ₹80.30 ( ₹ -0.70 )
- 8 గ్రాములు: ₹ 642.40 ( ₹ -5.60 )
- 10 గ్రాములు: ₹ 803 ( ₹ -7 )
- 100 గ్రాములు: ₹ 8,030 ( ₹ -70 )
- 1000 గ్రాములు: ₹ 80,300 ( ₹ -700 )
from SumanTV https://ift.tt/xviP1Mc