Nithin movie : పవన్ కళ్యాణ్ టైటిల్ తో నితిన్ మూవీ… రెండు దశాబ్దాల తర్వాత!

nitin movie

Nithin movie : పవన్ కళ్యాణ్ కి జనాలే కాదు హీరోలు కూడా అభిమానులే. అలాంటి వారిలో నితిన్ ఒకరు. పవన్ అంటే నితిన్ కి అమిత ఇష్టం. తన సినిమాల్లో ఆయన మేనరిజమ్స్ అనుకరిస్తారు. అలాగే కొన్ని పాటలు కూడా పెట్టాడు. ఈసారి ఆయన టైటిల్ నే వాడేశాడు. నేడు కొత్త మూవీ ప్రారంభించిన నితిన్ తమ్ముడు అనే టైటిల్ ప్రకటించాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కెరీర్లో సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా ఉంది. చిరంజీవి తమ్ముడిగా ఆ టైటిల్ పవన్ కళ్యాణ్ కి బాగా కలిసొచ్చింది.

స్పోర్ట్స్ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తమ్ముడు చిత్రం తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ బాక్సర్ గా కనిపించారు. ఈ సినిమా వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్లకు నితిన్ ఆ టైటిల్ ని వాడుకుంటున్నాడు. తమ్ముడు చిత్ర నిర్మాత దిల్ రాజు. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకుడు. నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

నితిన్, దిల్ రాజు, వేణు శ్రీరామ్ ఇతర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక కొన్ని టైటిల్స్ విషయంలో బాధ్యతగా ఉండాలి. మంచి సినిమా అందించి నా బాధ్యత నెరవేరుస్తానని నితిన్ అన్నారు. వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ అనంతరం గ్యాప్ తీసుకుని ఈ చిత్రం చేస్తున్నారు.

మరోవైపు నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక చిత్రం ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రచయిత వక్కంతం వంశీ ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు తాజాగా వేణు శ్రీరామ్ మూవీ ప్రకటించారు.



source https://oktelugu.com/nithin-movie-with-pawan-kalyan-title/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad