
America Principal: గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర అంటారు. ప్రతీ మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదే. ఒకప్పుడు గురువు అంటే గౌరవం, భక్తి, భయం ఉండేవి. కానీ మారుతున్న కాలం గురువు స్థానాన్ని మార్చేసింది. గురువులు కూడా గాడి తప్పుతున్నారు. దీంతో యథా గురువు.. తథా విద్యార్థులు అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఇందుకు తాజాగా అమెరికాలో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ.
అమెరికాలో ప్రిన్సిపాల్‌పై దాడి..
స్కూల్ ప్రిన్సిపాల్‌ను చితకబాదిన 9వ తరగతి స్టూడెంట్స్. వినటానికి షాకింగ్‌గా ఉన్నా.. ఇది నిజం. స్టూడెంట్స్ అంతా ఏకమై ప్రిన్సిపాల్‌ను దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన చాలా మంది వారిపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందంటే? అది అమెరికా టెక్సాస్‌లోని వెస్ట్ ఫీల్డ్ హై స్కైల్. ఈ పాఠశాలలో చాలా మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆ స్కూల్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్‌పై 9వ తరగతి విద్యార్థులు అంతా పగ పెంచుకున్నారు.
సమయం కోసం చూసి..
చాలా కాలంగా సమయం కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో వారు అనుకుంటున్న సమయం రానే వచ్చింది. స్కూల్ లోనే ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా పిడు గుద్దులు గుద్దారు. ఇక ఇష్టమొచ్చినట్లు దాడి చేస్తూ ప్రిన్సిపాల్‌కు చుక్కలు చూపించారు. ఇదంతా అక్కడే ఉన్న మరి కొంతమంది స్టూడెంట్స్ సెల్ ఫోన్‌లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
స్పందిస్తున్న నెటిజన్లు..
ఇక ఈ వీడియోను చూసిన చాలా మంది ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. ప్రిన్సిపాల్ ఏం చేసి ఉంటుందో.. విద్యార్థులు విద్యార్థుల్లా ఉండాలి.. అమెరికాలో అంతే.. గన్నులు పేలుస్తున్న రోజుల్లో దాడి పెద్ద విషయమా.. ఇలా అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రిన్సిపాల్ వాళ్లను రాచి రంపాన పెట్టిందో.. లేక పిల్లలకే ప్రిన్సిపాల్ నచ్చలేదో తెలియదు కానీ దాడి మాత్రం ముమ్మాటికీ తప్పే..
— Hardin (@hardintessa143) May 4, 2023
source https://oktelugu.com/students-who-crushed-the-lady-principal-in-america-video-viral/