Kushi Twitter Review: ఖుషి ట్విట్టర్ రివ్యూ: విజయ్ దేవరకొండ మూవీ హిట్టా ఫట్టా?

Kushi Twitter Review

Kushi Twitter Review: విజయ్ దేవరకొండ క్లీన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. చెప్పాలంటే గీత గోవిందం తర్వాత కమర్షియల్ హిట్ పడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ పూర్తిగా నిరాశపరిచింది. ఆ సినిమా విజయం సాధిస్తే విజయ్ దేవరకొండ ఇమేజ్ ఎక్కడో ఉండేది. ఈ క్రమంలో ఆయనకు అచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నాడు. దర్శకుడు శివ నిర్వాణ ప్రేమకథలు తెరక్కించడంలో ఎక్స్పర్ట్. సమంత హీరోయిన్ గా నటించిన ఖుషి నేడు థియేటర్స్ లోకి వచ్చింది. యూఎస్ లో ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో టాక్ బయటకు వచ్చింది.

మెజారిటీ ఆడియన్స్ ఖుషికి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. విజయ్ దేవరకొండకు హిట్ పడిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది. ఇంటర్వెల్ ఆసక్తి రేపుతుందని అంటున్నారు. క్లైమాక్స్ తో పాటు చివరి 30 నిమిషాలు ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగుతుందని అంటున్నారు. విజయ్ దేవరకొండ-సమంత ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరింది. వారి పెర్ఫార్మన్స్ చాలా బాగుందన్న మాట వినిపిస్తుంది. కామెడీ, ఎమోషన్, రొమాంటిక్ సన్నివేశాలు వర్క్ అవుట్ అయ్యాయని అంటున్నారు.

ముఖ్యంగా సినిమాకు పాటలు, బీజీఎమ్ హైలెట్ అంటున్నారు. సినిమాటోగ్రఫీ మెప్పిస్తుందని అంటున్నారు. అదే సమయంలో కొన్ని మైనస్ పాయింట్స్ వినిపిస్తున్నాయి. సినిమా నిడివి పెరిగింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు తొలగిస్తే బాగుండని అంటున్నారు. దాని వలన అక్కడక్కడగా కొంచెం బోరింగ్ గా సాగుతుంది. కథలో కూడా కొత్తదనం లేదంటున్నారు. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం జాగ్రత్త వహిస్తే చిత్ర ఫలితం మెరుగ్గా ఉండేదని అంటున్నారు.

మొత్తంగా చూస్తే విజయ్ దేవరకొండకు హిట్ పడిందని అనిపిస్తుంది. ఖుషి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ బాగా కష్టపడ్డాడు. అమెరికాలో ఉన్న సమంత అక్కడ ఈవెంట్స్ చేసింది. వారి కష్టానికి ఫలితం దక్కింది. సమంత కూడా పరాజయాల్లో ఉంది. ఆమె నటించిన శకుంతల డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఖుషి చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



source https://oktelugu.com/vijay-deverakonda-kushi-twitter-review-in-telugu/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad