Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

adipurush ott

పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతిసనన్ నటించిన ఆదిపురుష్ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ జానకిగా, హనుమంతుని పాత్రలో దేవదత్త నాగే, రావణాసురిడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ వంటి వాళ్ళు నటించిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రామాయణం ఆధారంగా తెరకెకెక్కిన ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సినిమా రిలీజ్ కి ముందు నుంచి కూడా తేడా కొడుతుందన్న విమర్శలు ఎక్కువగానే వచ్చాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాకి ఆ విజువల్ ఎఫెక్ట్స్ నాశిరకంగా ఉన్నాయని ట్రోల్స్ కూడా చేశారు. కొంతమంది అయితే ప్రభాస్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలుస్తుందని అన్నారు.

అయితే ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ ఖాయమని అన్నారు. మరోవైపు ప్రతీ థియేటర్ లో ఒక సీటుని ఆంజనేయస్వామి కోసం కేటాయించడం.. కొంతమందికి ఉచితంగా టికెట్లు ఇప్పించడం వంటి పబ్లిసిటీ స్టంట్స్ కొంత మేర సినిమా చూసేలా ఆకర్షించాయి. సినిమా విడుదలైన తొలి వీకెండ్ కలెక్షన్స్ రఫ్ఫాడించింది. కానీ ఆ తర్వాత వీక్ పెర్ఫార్మెన్స్ తో డల్ అయ్యింది. దీంతో సినిమా ప్లాప్ గా నిలిచింది. అయితే ప్రభాస్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ప్రభాస్ కోసమైనా సినిమా చూడాలి అన్నంతగా డార్లింగ్ అందరినీ మెప్పించారు. దర్శకుడు ఓం రౌత్ కథను మార్చడం, నాశిరకం విజువల్ ఎఫెక్ట్స్ చూపించారన్న పలు కారణాల వల్ల సినిమా ఫలితం నిరాశపరిచింది.

అయితే ప్రభాస్ కోసం సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకునే వారి కోసం, సినిమా చూడనటువంటి వారి కోసం ఆదిపురుష్ చూసే అవకాశం వచ్చేసింది. సినిమా విడుదలైన దాదాపు రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చింది. చడీ చప్పుడు లేకుండా సైలెంట్ గా ఆదిపురుష్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఒక ఓటీటీలో కాదు, ఏకంగా రెండు ప్రముఖ ఓటీటీ వేదికలపై ఆదిపురుష్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లోకి అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో అవుతోంది. మరి ఈ చిత్రం ఓటీటీల్లో ఎంత మేర మెప్పిస్తుందో చూడాలి.



from SumanTV https://ift.tt/1oHFrgn

Post a Comment

Previous Post Next Post

Below Post Ad