
Women : చాలా మంది ఆలయాల్లో తలనీలాలు సమర్పిస్తుంటారు. దేవున్ని మెక్కు కుంటే ఇస్తారు. ఏవైనా కోరికలు కోరిన తర్వాత నెరవేరితే గుండు చేయించుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తిరుపతి దేవస్థానంలో తలనీలాలు సమర్పిస్తుంటారు. భారీ సంఖ్యలో రోజుకి ఎన్నో వేల మంది వెంకటేశ్వరుడికి తలనీలాలు సమర్పిస్తారు. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా తలనీలాలు ఇస్తారు. అయితే అబ్బాయిలు గుండు చేయించుకున్నా వారికి జుట్టు తొందరగానే వచ్చేస్తుంది. కానీ అమ్మాయిలు గుండు చేయించుకుంటే వారికి జుట్టు రావడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఆడపిల్లలను లక్ష్మీ దేవిగా భావిస్తారు. లక్ష్మీ దేవి అంటే అన్ని విధాలుగా కూడా బొట్టు, కట్టుతో కళకళలాడుతుంది. అదే అమ్మాయిలు గుండు చేయించుకుంటే.. అసలు అందమే ఉండదు. అమ్మాయిలు అసలు గుండు చేయించుకోకూడదని చాలా మంది అంటుంటారు. ఇలా అమ్మాయిలు గుండు చేయించుకోవడం వల్ల సమస్యలు వస్తాయని, ఇంట్లో కష్టాలు ఉంటాయని అంటుంటారు. అయితే నిజంగానే అమ్మాయిలు గుండు చేసుకోకూడదా? ఒకవేళ గుండు చేయించుకుంటే ఏమవుతుంది? దీని పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిజానికి ఎక్కువగా అబ్బాయిలు, పిల్లలకు గుండు చేయిస్తారు. అబ్బాయిలు మొక్కు అనే కాకుండా కొత్త హెయిర్ రావాలని చేయిస్తారు. అదే పిల్లలకు అయితే జుట్టు ఎక్కువగా ఉంటే చిరాకు పడతారని వారికి గుండు చేయిస్తారు. మరి మహిళలు గుండు చేయించుకోవచ్చా అంటే చేయించుకోకూడదని ఎక్కువగా వినిపిస్తోంది. గుండు చేయించుకునే సంప్రదాయం కేవలం పురుషులకు మాత్రమే ఉంది. మహిళలు గుండు చేసుకోకూడదని పండితులు అంటున్నారు. అందులోనూ ముత్తయిదు స్త్రీలు అయితే అసలు గుండు చేయించుకోకూడదని పండితులు చెబుతున్నారు. కొందరికి తెలియక మొక్కు అని గుండు చేయించుకుంటారు. దేవుని మీద భక్తి ఉండి మొక్కు కుంటే మాత్రం మూడు లేదా ఐదు తలనీలాలు మాత్రమే ఇవ్వాలి. స్త్రీలు నిండుగా ఎప్పుడు లక్ష్మీ దేవిలా ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీ దేవి సిద్ధిస్తుంది. నిజానికి స్త్రీలకు అందం జుట్టు. కురులు ఉంటేనే వారు అందంగా కనిపిస్తారు. లేకపోతే అబ్బాయిలాగానే కనిపిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది మొక్కు కంటే క్యాన్సర్ వల్ల జుట్టు ఇస్తున్నారు. క్యాన్సర్ ఉంటే కీమో థెరపీలు చేయించుకుంటారు. ఈ సమయంలో ఎక్కువగా జుట్టు అనేది రాలుతుంది. దీంతో కొందరు గుండు చేయించుకుంటారు. ఇలాంటి వారికి జుట్టు ఎక్కువగా ఉన్నవారు దానం కూడా చేస్తుంటారు. వారి దగ్గర ఉన్న జుట్టును విగ్గు కోసం ఇస్తుంటారు. ఇలా ఇవ్వడం వల్ల వారి అందం, కాన్ఫిడెన్స్ తిరిగి వస్తాయని నమ్ముతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.
source https://oktelugu.com/lifestyle/can-women-shave-their-heads-what-happens-if-they-do-497261.html