
Tardigrade : పుట్టిన మనిషికి మరణం తప్పదు.. మరణించిన మనిషికి జననం తప్పదనే వ్యాఖ్యలు వింటూనే ఉంటాం. నిజానికి ఈ ప్రపంచంలో (World) ప్రాణం ఉన్న ప్రతీ జీవి ఎప్పుడో ఒకసారి మరణిస్తుంది. ఒక్కో దానికి ఒక్కో కాల పరిమితి ఉంటుంది. వాటి సమయం వచ్చినప్పుడు అవి మరణిస్తుంటాయి. ఈ ప్రపంచంలో దేనికి కూడా మరణం లేకుండా ఉండదని చాలా మంది భావిస్తారు. కానీ ఈ ప్రపంచంలో (World) ఓ జంతువుకి (Animal) మాత్రం అసలు మరణమే ఉండదు. నిజానికి చెప్పాలంటే ఈ భూమిపై ఉన్న అన్ని జంతువులు, పక్షులు, మనుషులు ఇలా మొత్తం ప్రపంచం అంతం అయినా కూడా ఒక్క జీవి మాత్రం అసలు మరణమే ఉండదు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా కూడా మీరు విన్నది నిజమే. ప్రతీ ప్రారంభానికి ఒక ముగింపు ఉంటుంది. కానీ ఈ జంతువుకి మాత్రం అసలు ముగింపు ఉండదు. ఇంతకీ ఆ జంతువు ఏంటి? అసలు ఎందుకు ఆ జంతువు చనిపోదు? దీనికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
సునామీ లేదా ఇంకా ఏదైనా ప్రళయం వచ్చినా అందరూ చనిపోతారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ జీవి కూడా చనిపోతుంది. కానీ టార్డిగ్రేడ్ అనే జంతువు మాత్రం మానవ జాతి అంతరించిపోయినా కూడా చనిపోదు. ఈ జంతువు నీరు, ఆహారం లేకుండా కూడా దాదాపు 30 ఏళ్లు జీవిస్తుంది. 150 డిగ్రీల సెల్సియస్ లేదా 302 డిగ్రీల ఫారెన్‌హీట్ వేడి, -457 డిగ్రీల చలిలో కూడా దీనికి ఏం కాదు. ఇంతటి చలిలో మానవులు, జంతువుల అన్ని మరణిస్తాయి. కానీ ఈ జంతువు మాత్రం మృతి చెందదు. సూర్యుడు ఉన్నంత వరకు ఈ జీవి జీవించి ఉంటుంది. సూర్యుని కాంతికి కూడా ఈ జంతువు చనిపోదు. ఈ జంతువుకి ఎనిమిది కాళ్లు ఉంటాయి. దీనిని నీటి ఎలుగుబంటి లేదా నీటి పంది అని కూడా పిలుస్తారు. ఎంతటి కఠిన పర్యావరణంలో అయినా కూడా ఈ జీవి ఇలానే ఉంటుంది.
ఈ టార్డిగ్రేడ్ 0.5 మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. వేడి నీటిలో ఉడకబెట్టడం లేదా గడ్డకట్టడం వంటివి ఉన్నా కూడా ఈ జంతువు దాదాపుగా 200 సంవత్సరాల వరకు జీవించగలదు. వరదలు, సునామీలు ఎన్ని సవాళ్లు వచ్చినా ఈ జీవి బతుకుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి డైనోసార్లు అంటే చాలా మందికి భయం. ఇవి చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అయితే ఇవి చూడటానికి వాటి కంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఇలా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా హాయిగా జీవించగలవు. ఎంతో కఠినమైన జంతువు కూడా. వీటిని చాలా మంది చూసే ఉంటారు. ఎక్కువగా జూ వంటి ప్రాంతాల్లో ఇవి కనిపిస్తుంటాయి. అయితే మన ఇండియాలో కంటే ఇతర దేశాల్లో ఎక్కువగా ఉంటాయని అంటుంటారు.
source https://oktelugu.com/lifestyle/the-tardigrade-is-the-only-animal-in-the-world-that-never-dies-496733.html