
Hornbill bird : ఈ భూమ్మీద తల్లిని మించి ప్రేమ చూపించే వ్యక్తి మరొకరు ఉండరు. అందువల్లే మాతృదేవోభవ అనే సామెత పుట్టింది. తన ప్రాణాలు పోతున్నా సరే తన కడుపులో పెరుగుతున్న మరొక ప్రాణానికి ఊపిరిలూదుతుంది. తన కడుపులో పడిన నాటి నుంచి ప్రాణిగా బయటికి వచ్చేంతవరకు ఎన్నో ఆశలు పెంచుకుంటుంది. మరెన్నో త్యాగాలు చేస్తుంది. అయితే కేవలం మనుషులు మాత్రమే కాదు.. ఈ భూమ్మీద ఉన్న అన్ని జంతువులు తమ పిల్లల కోసం ఇలాంటి త్యాగాలే చేస్తాయి.
కేవలం మనుషులు మాత్రమే కాకుండా.. పక్షులు, జంతువులు కూడా మాతృత్వాన్ని ఆస్వాదించడానికి.. పిల్లలకు జన్మనివ్వడానికి ఎంతో తాపత్రయపడతాయి. ఇలా చేయడానికి ఎన్నో త్యాగాలు చేస్తాయి. తమ సంతతిని పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. జంతువులు మాతృత్వాన్ని ఆస్వాదించడానికి ఎంతలా అయితే తాపత్రయపడతాయో.. పక్షులు కూడా అదే స్థాయిలో కష్టపడతాయి.. ప్రఖ్యాత బీబీసీ ఛానల్(BBC channel) ఆఫ్రికా అడవుల్లో ఉండే హార్న్ బిల్స్ పక్షి( horn billsbird) గురించి ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. అందులో హార్న్ బిల్స్ తన సంతానాన్ని పెంచుకోవడానికి పడే తాపత్రయాన్ని చూపించింది. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. పిల్లలను కనడానికి తన భాగస్వామితో కలిసి హార్న్ బిల్స్ పడే కష్టం ఆ డాక్యుమెంటరీలో కళ్ళకు కట్టినట్టు కనిపించింది.. ఆడ హార్నబిల్స్ పక్షి గుడ్లను పొదగడానికి తనకు అత్యంత అనువైన ప్రదేశాన్ని వెతికింది. అందులోనూ అతి పెద్ద చెట్టును పరిశీలించింది. దానికాండం భాగంలో ఒక తొర్రను ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత గుడ్లకు వెచ్చదనం అందించడానికి తన ఈకలను తానే పీకేసుకుంది. ఆ తర్వాత ఆ పక్షి ఈకలను కింద పరి చేసింది.. ఆ తర్వాత మగ పక్షి తెచ్చిన మట్టితో ఆ తొర్రను మూసేసింది. మగపక్షి మాత్రం బయటే ఉండిపోయింది. అది బయట నుంచి ఆహారాన్ని సేకరించి ఆడ పక్షికి అందివ్వడం మొదలుపెట్టింది.. ఈ వీడియో పక్షులు తమ సంతానాన్ని పెంపొందించుకోవడానికి పడే కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది.
అందుకోసమేనట
హార్న్ బిల్స్ పక్షుల మాంసం అత్యంత రుచిగా ఉంటుంది. వీటి గుడ్లను తినడానికి పాములు తెగ ప్రయత్నిస్తుంటాయి. ఇతర జంతువులు కూడా వేటాడేందుకు యత్నిస్తుంటాయి. అందువల్లే హార్న్ బిల్స్ తమ సంతానాన్ని పెంపొందించుకోవడానికి ప్రత్యేకంగా తొర్రలు ఏర్పాటు చేసుకుంటాయి.. ఈకలతో ప్రత్యేకంగా తొర్రలను నిర్మించుకుంటాయి. బంక మట్టిని ప్రత్యేక ద్వారం లాగా రూపొందించి.. అడ్డు పెడతాయి. దీనివల్ల పాములు, ఇతర జంతువులు హార్న్ బిల్స్ పక్షుల గుడ్లను తినలేవు. ఎటువంటి హాని తలపెట్టలేవు. హార్న్ బిల్స్ పక్షులలో ప్రత్యేకంగా ఉంటాయి. తమసంతానాన్ని పెంపొందించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటాయి. పైగా ఈ పక్షులు ప్రత్యేకమైన పండ్లను తింటాయి. అందువల్లే వీటి మాంసాన్ని ఇతర జంతువులు ఇష్టంగా తింటాయి. ఇక ఆఫ్రికాలో ఉండే ఆదివాసి తెగలు హార్న్ బిల్స్ పక్షుల మాంసాన్ని ఇష్టంగా తింటారు. ఉదర సంబంధ రోగాలు.. అంటువ్యాధుల నివారణకు ఈ మాంసం తోడ్పడుతుందని ఆదివాసి తెగలు భావిస్తుంటాయి.
source https://oktelugu.com/odd-news/a-documentary-that-shows-the-pains-that-hornbills-go-through-to-raise-their-offspring-499244.html