
South Georgia : టైటానిక్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. భారీ మంచు కొండను (Ice Burg) ఢీకొనడం వల్ల ఈ షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఎందరో వేలాది మంది మరణించారు. ఏదో కొంచెం ఐస్ బర్గ్‌ను (A23a) ఢీకొనడం వల్ల పెద్ద ప్రమాదమే జరిగింది. అయితే ప్రపంచంలోని అతిపెద్ద మంచుకొండ (A23a) అంటార్కిటికా తీరంలో రిమోట్ బ్రిటిష్ ద్వీపాన్ని ఢీకొననుంది. ఈ మంచు కొండ ఎన్నో ట్రిలియన్ టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇది దాదాపుగా 3,900 చ.కి.మీలో ఉంది. న్యూయార్క్ నగరానికి దాదాపుగా మూడు రెట్లు ఈ మంచుకొండ ఉంది. అయితే ఈ మంచు కొండ (A23a) దక్షిణ జార్జియాకి కేవలం 280 కి.మీ దూరంలో మాత్రమే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ మంచు కొండ దక్షిణ జార్జియాకు దగ్గరగా వస్తుంది. ఇంకో రెండు లేదా నాలుగు వారాల్లో ఈ మంచు కొండ దక్షిణ జార్జియాను ఢీకొట్టనున్నట్లు నిపుణులు అంటున్నారు. ఇదే కనుక జరిగితే మాత్రం దక్షిణ జార్జియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనుంది. ఈ మంచు కొండ ఢీకొంటే మాత్రం అది వన్యప్రాణులపై తీవ్రంగా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రదేశంలో ఎక్కువగా కింగ్ పెంగ్విన్‌లు, ఏనుగులు, బొచ్చు సీల్స్ వంటి ముఖ్యమైన జంతువులు ఉన్నాయి. పెంగ్విన్, సీల్ వంటి జంతు జాతులు ఇప్పటికే అంతరించిపోతున్నాయి. ఇంతలో మళ్లీ ఐస్ బర్గ్ దక్షిణ జార్జియాను ఢీకొంటే మాత్రం తప్పకుండా ఇవి క్షీణిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ మంచు కొండ (A23a) 1986లో ఫిల్చ్‌నర్ ఐస్ షెల్ఫ్ నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఇది దాదాపుగా 30 సంవత్సరాల పాటు వెడ్డెల్ సముద్రంలో చిక్కుకుంది. అయితే ఈ మంచు కొండ సముద్రంలో 2020 వరకు పెరగకుండానే ఉంది. కానీ ప్రస్తుతం ఈ మంచు కొండ ఎక్కువగా పెరుగుతోంది. మొదట్లో ఎందో నెమ్మదిగా ప్రయాణించిన ఈ ఐస్ బర్గ్ ప్రస్తుతం తొందరగా ప్రయాణిస్తుంది. ఇది ఎక్కువగా నిశ్చలంగా ఉంది, అది మరోసారి ప్రవహించడం ప్రారంభించింది. సముద్రగర్భ పర్వతం పైన నీటిని తిప్పడం వల్ల నెలల తరబడి ఇది పెరగలేదు. కానీ ప్రస్తుతం ఈ మంచుకొండ ఉహించని దాని కంటే ఎక్కువ స్పీడ్‌గా కదులుతోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ మంచు కొండ దక్షిణ జార్జియా వైపు ప్రయాణిస్తోంది. ఇదే కనుక ఢీకొడితే మాత్రం వన్య ప్రాణులతో పాటు పర్యావరణం కూడా చాలా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే కేవలం వన్యప్రాణులకు మాత్రమే కాకుండా మనుషులకు కూడా కాస్త ఇబ్బంది ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఇంత పెద్ద మంచు కొండ దక్షిణ జార్జియాను ఢీకొడితే ఇక ప్రళయమే అవుతుందని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఇది ఢీకొట్టకుండా ఆపడం కూడా కష్టమే అని పలువురు అంటున్నారు. మరి ఇది ఎప్పుడు ఢీకొడుతుందో చూడాలి.
source https://oktelugu.com/world/worlds-largest-iceberg-to-hit-south-georgia-494907.html