ఆస్ట్రేలియా 654/6

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య శ్రీలంక టీమ్ గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే శ్రీలంక మరో 610 పరుగులు చేయాలి. ఓపెనర్లు ఒశాడ ఫెర్నాండో (7),దిముత్ కరుణరత్నె (7) విఫలమయ్యారు. సీనియర్ బ్యాటర్ ఎంజిలో మాథ్యూస్ (7) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో కీలకమైన మూడు వికెట్లను కోల్పోయిన లంక కష్టాల్లో చిక్కుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది.

ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా డబుల్ సెంచరీతో అలరించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ఖాజా 352 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 232 పరుగులు చేశాడు. కెప్టెన్ స్మిత్ (141) సెంచరీ సాధించాడు. ఇక జోష్ ఇంగ్లిస్ దూకుడుగా ఆడి శతకం నమోదు చేశాడు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఇంగ్లిస్ 94 బంతుల్లోనే 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 102 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ అలెక్స్ కారే (46), వెబ్‌స్టర్ (23), స్టార్క్ 19 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు.

 



from Mana Telangana https://ift.tt/P0uL3hK

Post a Comment

Previous Post Next Post

Below Post Ad