దక్షిణ సూడాన్‌లో బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం సంభవించి 20 మంది చనిపోయారు. ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. యూవిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉదయం 10.30 గంటలకు ఉద్యోగులను తీసుకుని విమానం రాజధాని జుబాకు బయలుదేరగా, రన్‌వే నుంచి 500 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంతో చమురు క్షేత్రాల సమీపంలో విమాన శకలాలు తలకిందులుగా పడిపోయాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
from Mana Telangana https://ift.tt/RjObBHW
Tags:
Mana Telangana