నేడు రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

పార్లమెంటు ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ నెల 10 శుక్రవారం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రధాన మంత్రి పాల్గొని ప్రసంగించే భారీ బహిరంగ సభ నిర్వహణకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో కలిపి ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ భారీ సభలో ప్రధాన మంత్రి సాయంత్రం 5.30 నుంచి 6.20 వరకు పాల్గొంటారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం 6.40కి బేగంపేట విమానాశ్రయం నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరి వెళతారు. మోదీ సభ విజయవంతం చేయడం కోసం పార్టీ శ్రేణులు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులకు జన సమీకరణ చేపట్టే బాధ్యతను అప్పగించారు.

ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ముందు ప్రధాని కర్ణాటక రాష్ట్రం గుల్భర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేటకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5.10కి హైదరాబాద్ చేరుకోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ తదితరులు ఎల్బీ స్టేడియంలో ప్రధాని పాల్గొనే సభ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. కాగా హైదరాబాద్‌లోని ప్రతి గల్లీ నుంచి రేపు ఎల్బీ స్టేడియంకు తరలి రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌కు సమీపంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధి నుంచి పార్టీ కార్యకర్తలు, యువత ఎల్బీ స్టేడియంకు రావాలని అన్నారు. కార్యకర్తలు అందరూ తమ బూత్‌ల పరిధిలోని ప్రజలు అందరిని బహిరంగ సభకు తీసుకురావాలని కోరారు.

 



from Mana Telangana https://ift.tt/Sn258JU

Post a Comment

Previous Post Next Post

Below Post Ad