లిక్విడ్ ఆక్సిజన్ కిరోసిన్ ఆధారిత క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి : ఇస్రో

లిక్విడ్ ఆక్సిజన్ కిరోసిన్ ఆధారంగా పనిచేసే సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసినట్టు ఇస్రో సోమవారం వెల్లడించింది. ఇది 2,000 కెఎన్ (కిలో న్యూటన్ ) చోదక సెమీక్రయోజెనిక్ ఇంజిన్‌గా పేర్కొంది. లాంచ్ వెహికల్ మార్క్ 3 (ఎల్‌విఎం3) తోపాటు, భవిష్యత్ లాంచ్ వెహికల్స్‌ను కూడా ఇది చోదక శక్తిగా పనిచేస్తుందని ఇస్రో పేర్కొంది. ఇస్రోకు చెందిన ఇతర లాంచ్ వెహికిల్ సెంటర్ల సహకారంతో సెమీ క్రయోజెనిక్ చోదక వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి లిక్విడ్ ప్రొపల్సన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పిఎస్‌సి) ప్రధాన కేంద్రంగా పేర్కొన్నారు. మహేంద్రగిరి లోని ఇస్రో ప్రొపల్సన్ కాంప్లెక్స్ (ఐపిఆర్‌సి) వద్ద ప్రొపల్సన్ మాడ్యూల్స్ అసెంబ్లీ, టెస్టింగ్ నిర్వహించినట్టు ఇస్రో వివరించింది.



from Mana Telangana https://ift.tt/eyGkc6Y

Post a Comment

Previous Post Next Post

Below Post Ad