ఎపి డిజిపి రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఇసి బదిలీ వేటు

ఎపి డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డిజిపిని తక్షణమే బదిలీ చేయాలని ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కింది ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఇసి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని స్పష్టం చేసింది. సోమవారం ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డిజి ర్యాంక్ అధికారుల జాబితా పంపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. గత కొంత కాలంగా విపక్ష రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఇసి ఈ మేరకు చర్యలు తీసుకుంది. అధికార వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఇంతకుముందు ఎన్నికల సంఘం ఎపిలో ఇద్దరు డిఎస్‌పిలపై బదిలీ వేటు వేసింది. వారిపై అందిన ఫిర్యాదుల మేరకు ఇసి ఈ మేరకు చర్యలు తీసుకుంది.

అనంతపురం డిఎస్‌పి వీర రాఘవరెడ్డి, రాయచోటి డిఎస్‌పి మహబూబ్ బాషాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. కాగా, మే 13న ఎపిలో అసెంబ్లీ ఎన్నికల తోపాటు లోక్‌సభ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు విస్తృత ప్రచా రంతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. అధికార వైసిపి ఒంటరిగా పోటీ చేస్తుండగా, టిడిపి, జనసేన, బిజెపి పార్టీలో కూటమిగా బరిలో దిగుతున్న విష యం విదితమే. అన్ని పార్టీలు తాము ఏం చేస్తామో చెబుతూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే, జూన్ 4న ప్రజల తీర్పు వెలువడనుంది. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో హోం ఓటింగ్ షురూ అయ్యింది.



from Mana Telangana https://ift.tt/FuQ8fMq

Post a Comment

Previous Post Next Post

Below Post Ad