సముద్ర మట్టాలు పెరుగుతూ ఉండటంతో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక సరికొత్త రాజధాని ఏర్పాటు విషయంపై అధికార యంత్రాంగం పరిశీలన చేపట్టింది. బ్యాంకాక్‌కు ముప్పు పొంచి ఉన్న విషయాన్ని, రాజధానిని మార్చే అంశాన్ని సీనియర్ అధికారి ఒక్కరు బుధవారం తెలిపారు. పల్లంగా ఉండే బ్యాంకాక్ సముద్ర మట్టం ఈ శతాబ్ధం చివరికి పూర్తిగా సముద్రంల కలిసిపోతోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎప్పుడూ రద్దీగా కళకళలాడుతూ ఉండే బ్యాంకాక్ వర్షాకాలంలో పూర్తిగా వరదమయం అవుతోంది. గ్లోబల్ వార్మింగ్ పరిణామక్రమం బ్యాంకాక్‌పై పడుతోందని ఆందోళన వ్యక్తం అయింది.
from Mana Telangana https://ift.tt/zKbuGRy
Tags:
Mana Telangana