ప్రముఖ కన్నడ నటి పవిత్ర జయరామ్ ఆదివారం ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. తెలుగులో వచ్చిన త్రినయని సీరిస్‌లో ఈ నటి తిలోత్తమగా నటించారు. విశేష రీతిలో అభిమానులను సంపాదించుకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పక్కకు వెళ్లగా కుడివైపు నుంచి వేగంగా వస్తున్న బస్సు కారును ఈడ్చుకుంటూ వెళ్లింది. . ఈ ఘటనలో పవిత్ర అక్కడికక్కడే చనిపోగా , డ్రైవర్ శ్రీకాంత్, నటి సమీప బంధువు ఆపేక్ష, నటుడు చంద్రకాంత్ తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి కర్నాటకకు వెళ్లుతుండగా వనపర్తి వద్ద ప్రమాదం జరిగిందని వివరించారు.
from Mana Telangana https://ift.tt/gzuvc3j
Tags:
Mana Telangana