నిప్పుల గుండం

మన తెలంగాణ/హైదరాబాద్ :భానుడి దెబ్బకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోవడంతో వడదెబ్బకు ఒకరు మృత్యువాత పడ్డారు. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తెలంగాణ నిప్పులగుండంగా మారుతోంది. 10 రోజులుగా ( ఏప్రిల్ 28 నా టికి) సూర్యుని ప్రతాపానికి జనం బయటకు రావడానికి అల్లాడుతున్నారు. మరో 10 రో జుల పాటు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మ రింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కనిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. నేడు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎం డలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందువల్ల ప్రజలు మధ్యాహ్నం తర్వాత బయటకి రావద్దని వాతావరణ శాఖ సూచించింది.

ఈ నేపథ్యంలోనే 9 జిల్లాలకు ఏప్రిల్ 29,30 తేదీలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, నల్గొండ, ములుగు, జగిత్యాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా సూర్యాపేట జిల్లాలో ఒకరు వడదెబ్బతో ఒకరు మృత్యువాత ప డ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు పె రుగుతున్నాయి. దీంతో తెలంగాణలో ఉక్కపోత, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఈ ఏడాది మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటా యి. ఈ నేపథ్యంలోనే రా ష్ట్రంలో 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, తెలంగాణలోని రెండు జిల్లాలు తప్ప అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. నిర్మల్, జగిత్యాల,నల్గొండ, ఖమ్మం, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలను దాటగా, నల్గొండ జిల్లాలోని నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా ఏప్రిల్ 27వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం.

హైదరాబాద్‌లోనూ అధికమే….
హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేటి నుంచి రోజులు ఎండ త్రీవత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
50 ఏళ్లలో రాష్ట్రంలో 0.5 డిగ్రీలకు పెరిగిన సగటు ఉష్ణోగ్రత
గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మే నెలలో ఇంకా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 1970 జనవరి 1 నుంచి 2023 జూన్ 30 వరకు 53ఏళ్ల పాటు దేశంలో ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులను ఆధునిక పద్ధతుల్లో వాతావరణ శాఖ అధికారులు విశ్లేషించారు. ఈ అధ్యయనంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఏటా ఏప్రిల్ -టు జూన్ మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. యాభై ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. యాభై ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణలో సగటు ఉష్ణోగ్రత 0.5డిగ్రీలు పెరగ్గా, ఎపిలో 0.9 డిగ్రీలు పెరిగింది. దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఎపి 15వ స్థానంలో తెలంగాణ 28వస్థానంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.



from Mana Telangana https://ift.tt/kFWYuUX

Post a Comment

Previous Post Next Post

Below Post Ad