
Y S Sharmila: మొన్నటిదాకా పాదయాత్రతో తెలంగాణ లో హడావిడి చేసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. కొద్ది రోజుల నుంచి నిశ్శబ్దంగా ఉంటున్నారు. ట్విట్టర్ లో మాత్రం వరుస ట్వీట్లు పెట్టి టైంపాస్ చేస్తున్నారు. అయితే ఆమె తన పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్లో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా చర్చలు జరిపినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ సేవలు అవసరం లేదని ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి షర్మిల ఏపీ బాధ్యతలు స్వీకరిస్తే ఆమెకు తమ వంతుగా సహకారం అందజేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా తాము అంగీకరించబోమని అప్పట్లో ఆయన స్పష్టం చేశారు. అయితే షర్మిలకు మద్దతుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీకే శివకుమార్ వద్ద లాబీయింగ్ చేశారు.
వైయస్ వివేకానందా రెడ్డి ఉదంతమో మరో కారణమో తెలియదు కాని ఏపీ రాజకీయాలు అంటేనే షర్మిల భయపడుతున్నారు. నేను ఏపీ రాజకీయాలు చేయబోనని ఆమె తన సన్నిహితుల వద్ద అంటున్నట్టు సమాచారం. తనకు ఎటువంటి పదవులు ఇవ్వకపోయినప్పటికీ, అసలు పట్టించుకోకపోయినప్పటికీ తెలంగాణలోనే ఉంటానని ఆమె చెబుతున్నారు. అయితే ఈ మాటలను కాంగ్రెస్ అధిష్టానం చాలా సింపుల్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షర్మిల కాస్త వెనక్కి తగ్గారుఅనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏపీలో ప్రచారం చేయాలని షర్మిల ఎదుట ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో షర్మిల కాస్త మెత్తబడినట్టు సమాచారం. ఆమె మెత్తబడితే ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి విలీనం ప్రక్రియ తొందర్లోనే జరుగుతుందని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారు. అయితే గత వారం రోజులుగా బెంగళూరులోనే షర్మిల ఉంటున్నారు. తన రాజకీయ మనుగడ గురించి డీకే శివకుమార్ తో పలుమార్లు అంతరంగికంగా చర్చలు జరిపారని సమాచారం. చివరికి వెళ్లిన ముహూర్తాన్ని ఆగస్టు 12 తారీఖు కు ఖరారు చేసుకున్నారని వినికిడి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఆలస్యమైందని, ఇంకా నాన్చితే మొదటికే మోసం వస్తుందని షర్మిలకు అంతరంగికులు చెబుతున్నారు. ఇక తెలంగాణలోని పాలేరు నియోజకవర్గంలో షర్మిలకు కాస్త అనుకూల పరిస్థితిలు ఉన్నాయి. తమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించరని చాలా మంది అంటున్నారు. మొత్తంగా షర్మిల తన తండ్రిని చంపించాలని సోనియా గాంధీ మీద జగన్ రెడ్డితో కలిసి చేసిన ఆరోపణలు మొత్తం మరిచిపోయి మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళ్ళబోతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని ఆమె పలుమార్లు పొగిడారు. గతంలో విధేయత వారసత్వం వంతు కుటుంబం ఇచ్చిన ప్రకటనలో విధేయతను బయటకి తీస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి కూడా ఈ విధేయత ప్రకటన తప్పకపోవచ్చని, కాలమే అన్నింటికీ సరైన సమాధానం ఇస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాకపోతే ఇది జగన్ కు అతి త్వరలోనే అర్థమవుతుందని వారు అంటున్నారు.
source https://oktelugu.com/sharmilas-party-to-be-merged-with-congress/