Today Gold Rates: పతనమవుతున్న బంగారం, వెండి ధరలు!.. ఇంకా తగ్గే ఛాన్స్!

today-gold-rates

అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1933 డాలర్ల వద్ద ఉండగా నిన్న ఉదయం 1925 డాలర్ల వద్ద కొనసాగింది. ఏకంగా 8 డాలర్ల మేర తగ్గింది. దీంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,050 ఉండగా.. ఇవాళ రూ. 100 తగ్గింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. 54,950 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల బంగారం నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వద్ద రూ. 60,060 ఉండగా ఇవాళ రూ. 110 తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రూ. 59,950 వద్ద కొనసాగుతుంది.

వెండి ధర కూడా పసిడి బాటలోనే తగ్గుతూ వస్తుంది. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి 23 డాలర్ల పైన కొనసాగగా.. నిన్న ఉదయం 22.77 డాలర్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా వెండి ధర పతనమైంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 77,300 ఉండగా ఇవాళ రూ. 600 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్ లో రూ. 76,700 వద్ద కొనసాగుతుంది. మరి బంగారం, వెండి ధరలు తగ్గాయి కాబట్టి కొనేస్తే పోలే అని అనుకోకండి. ఇవాళ ఆగితే రేపు ఈ ధరలు ఇంకా పడిపోయే అవకాశం కనిపిస్తుంది.

ఎందుకంటే ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ప్రతికూలంగా సాగుతున్నాయి. ప్రస్తుతం అనగా ఉదయం 8 గంటలకు ఔన్స్ స్పాట్ గోల్డ్ 1918.88 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్నటి మీద పోలిస్తే దాదాపు 7 డాలర్ల మేర పడిపోయింది. ఈ కారణంగా దేశీయంగా బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇక వెండి ధర కూడా ఇలానే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ స్పాట్ వెండి 22.71 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. కాబట్టి రేపు తగ్గచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చు. కాబట్టి ఇవాళ కంటే కూడా రేపు కొనడం వల్ల డబ్బులు ఆదా అవుతాయి.

ఆగస్టు 10న 22 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 5,495 ( ₹ -10 )
  • 8 గ్రాములు: ₹ 43,960 ( ₹ -80 )
  • 10 గ్రాములు: ₹ 54,950 ( ₹ -100 )
  • 100 గ్రాములు: ₹ 5,49,500 ( ₹ -1000 )

ఆగస్టు 10న 24 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 5,995 ( ₹ -11 )
  • 8 గ్రాములు: ₹ 47,960 ( ₹ -88 )
  • 10 గ్రాములు: ₹ 59,950 ( ₹ -110 )
  • 100 గ్రాములు: ₹ 5,99,500 ( ₹ -1100 )

ఆగస్టు 10న వెండి ధరలు:

  • 1 గ్రాము: ₹76.70 ( ₹ -0.60)
  • 8 గ్రాములు: ₹ 613.60 ( ₹ -4.80 )
  • 10 గ్రాములు: ₹ 767 ( ₹ -6 )
  • 100 గ్రాములు: ₹ 7,670 ( ₹ -60 )
  • 1000 గ్రాములు: ₹ 76,700 ( ₹ -600 )


from SumanTV https://ift.tt/wQmWUjG

Post a Comment

Previous Post Next Post

Below Post Ad