Sai Rajesh Vs Vishwak sen: విశ్వక్ సేన్ తో వివాదం… అసలు మేటర్ భయపెట్టిన సాయి రాజేష్, అది నిజమేనట!

Sai Rajesh Vs Vishwak sen

Sai Rajesh Vs Vishwak sen: బేబీ మూవీ సూపర్ హిట్ కాగా హీరో విశ్వక్ సేన్ తో దర్శకుడు సాయి రాజేష్ కి వివాదం నెలకొంది. ఒక హీరో బేబీ కథ వినడానికి కూడా ఇష్టపడలేదు. ఆ డైరెక్టర్ అయితే స్క్రిప్ట్ వినాల్సిన అవసరం లేదని తిరస్కరించాడని సాయి రాజేష్ అన్నాడు. సాయి రాజేష్ మాటలకు విశ్వక్ సేన్ స్పందించడంతో వివాదం మొదలైంది. నో మీన్స్ నో. అది మగాళ్లకు కూడా వర్తిస్తుంది. మనం ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతున్నాం. అరవకుండా ఎంజాయ్ చేయండంటూ విశ్వక్ ట్వీట్ చేశాడు.

దాంతో సాయి రాజేష్ చెప్పిన హీరో విశ్వక్ సేన్ అనే క్లారిటీ అందరికీ వచ్చింది. ఈ క్రమంలో సాయి రాజేష్-విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వార్ కి దిగారు. ఫైనల్ గా సాయి రాజేష్ ఓపెన్ అయ్యారు. తన కథ వినని హీరో విశ్వక్ సేనే అని క్లారిటీ ఇచ్చాడు. విశ్వక్ సేన్ నా కథ వినడానికి ఇష్టపడలేదు. ఆయన ఎందుకు రిజెక్ట్ చేశాడో నాకు తెలియదు. బహుశా ఆయన ప్రయారిటీ లిస్ట్ లో నేను లేకపోయి ఉండొచ్చు. అయితే అతను తిరస్కరించిన విధానం నచ్చలేదు.

తాను రిజెక్ట్ చేసిన కథ హిట్ కొట్టింది. విజయాన్ని ఆస్వాదించకుండా ఎదుటివాళ్ళను ఇన్సల్ట్ చేయవద్దని విశ్వక్ అన్న మాటలు నన్ను బాధించాయి. అలా అని నాకేమీ విశ్వక్ మీద కోపం లేదు. విశ్వక్ సేన్ మొదటి సినిమా వెళ్ళిపోమాకే విడుదల చేయడానికి చాలా కష్టపడ్డాను. అల్లు అరవింద్, దిల్ రాజులను కలిసి వాళ్లకు సినిమా చూపించి మూవీ విడుదలయ్యేలా చేశాను… అని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.

సాయి రాజేష్ లేటెస్ట్ కామెంట్స్ తో ఈ వివాదం మీద స్పష్టత వచ్చింది. విశ్వక్ సేన్ రిజెక్ట్ చేయడంతో ఈ కథ ఆనంద్ దేవరకొండ వద్దకు వెళ్ళింది. బేబీ మూవీ దాదాపు రూ. 80 కోట్ల వసూళ్లు అందుకుంది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. విరాజ్ మరో ప్రధాన పాత్ర చేశాడు. 2023లో భారీ లాభాలు మిగిల్చిన చిత్రంగా బేబీ నిలిచింది.



source https://oktelugu.com/sai-rajesh-revealed-interesting-facts-about-vishwak-sen-controversy/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad