Ram Charan : చైల్డ్ ఆర్టిస్ట్ గా రామ్ చరణ్.. మెగా ఫ్యాన్స్ మిస్ అయిన సినిమా ఇదే

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి నట వారసుడిగా అడుగుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరోగా కొనసాగడమే కాకుండా ఏకంగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. సాధారణంగా స్టార్ హీరోల కొడుకులు చిన్న వయస్సులోనే బాల నటులుగా కనిపిస్తారు ఎక్కువగా. బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఇలా అనేక మంది బాలనటులుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లే. మెగా వారసుడు రామ్ చరణ్ కూడా బాలనటుడిగా నటించాడు.

నిజానికి ఈ విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. 2007 లో చిరుత సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన రామ్ చరణ్ అంతకు ముందు ఒక సినిమాలో చిరంజీవి తో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయాన్ని ఆయన ఫ్యాన్స్ కూడా నమ్మలేకపోతున్నారు. కానీ అది వాస్తవం. లంకేశ్వరుడు సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక సన్నివేశంలో ఉన్నాడని సినీ పెద్దలు చెబుతూ ఉంటారు.

చిరంజీవి అగ్రహీరో కాబట్టి అతని కొడుకును వెండితెర మీద చూపించాలని అనేక మంది దర్శకులు గట్టి ప్రయత్నాలే చేశారు . కానీ ఎవరికీ కుదరలేదు. కానీ దర్శకరత్న దాసరి నారాయణరావు మాత్రం మెగాస్టార్ ను ఒప్పించి లంకేశ్వరుడు సినిమాలో రామ్ చరణ్ ని బాల నటుడిగా తీసుకున్నారు. తీరా షూటింగ్ పూర్తి చేసి ఎడిటింగ్ టేబుల్ మీద సినిమాను చూసే సరికి, రామ్ చరణ్ తో తీసిన సన్నివేశాలు సినిమా ఫ్లో కి అడ్డుపడటమే కాకుండా, బలవంతంగా అతికించినట్లు ఉండటంతో వాటిని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.

లంకేశ్వరుడు సినిమా కు సంబంధించి రామ్ చరణ్, చిరంజీవి వర్కింగ్ స్టిల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే చరణ్ నటించిన సన్నివేశాలు మాత్రం సినిమాలో కనిపించవు. ఇలా జరగడంతో చరణ్ బాల నటుడిగా నటించిన కానీ చూసే అవకాశం మెగా ఫ్యాన్స్ కి రాలేదు. ప్రస్తుతం తన గారాల కూతురు తో టైం స్పెండ్ చేస్తున్న చరణ్ త్వరలోనే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రీ జాయిన్ కాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో మరో సినిమా చేసే అవకాశం ఉంది.



source https://oktelugu.com/ram-charan-as-child-artist-in-chiranjeevi-lankeshwarudu-movie/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad