
Lakshmi Parvathi: నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీపార్వతి కి తగిన గౌరవం లభించడం లేదు. ఆమెను ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆమెను నందమూరి కుటుంబం అంగీకరించడం లేదు. తాజాగా ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణేన్ని తాజాగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులందరికీ ఆహ్వానాలు అందాయి. కానీ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కి మాత్రం ఎవరూ పిలవలేదు. దీంతో దీంతో ఆమె తన బాధను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు రాశారు.
ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకోవడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అయినా సరే ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. అటు తర్వాత లక్ష్మీపార్వతి పెత్తనాన్ని సహించలేక ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబు సాయంతో ఎన్టీఆర్ నుంచి అధికారంతో పాటు తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్నారు. అక్కడకు కొన్నాళ్లకే ఎన్టీఆర్ మృతి చెందారు. అప్పటినుంచి ఇప్పటివరకు లక్ష్మీపార్వతిని దూరం పెట్టారు. చంద్రబాబు పై ఉన్న కోపంతో ఆమె వైసీపీలో చేరారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం చొరవతో రిజర్వ్ బ్యాంక్ ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని ఆయన పేరిట రూ.100 నాణేన్ని విడుదల చేయడానికి నిర్ణయించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కేంద్రం సంప్రదించింది. ఈ మొత్తం నాణెం తయారీలో పురందేశ్వరి కీలకపాత్ర పోషించారు. నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో సైతం ఆమెదే కీరోల్. ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు, కోడళ్ళు, మనుమలు, మనుమరాలు, ఇతర కుటుంబ సభ్యులు అందరికీ పేరుపేరునా ఆహ్వానాలు పంపించారు. ఒక్క లక్ష్మీపార్వతిని విస్మరించారు. దీనిని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్ కు సంబంధించి ఎటువంటి అంశమైనా తాను మొదటి అర్హురాలినని చెబుతున్నారు. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణకు సంబంధించి తనకు జరిగిన విస్మరణ పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలో పోరాడేందుకు సిద్ధపడుతున్నారు.
తాజాగా మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ” ఎన్టీఆర్కు నేనేమైనా ఇల్లీగల్ భార్యనా? ఇకపై నేను పురందేశ్వరి పోరాడుతా” అంటూ ఆగ్రహంగా ప్రకటించారు. ఎన్టీఆర్ స్మారక నాణాన్ని ప్రభుత్వమే ఆవిష్కరించి ఉంటే తనను ఆహ్వానించకపోవడం తప్పని చెప్పారు. కానీ ప్రైవేటు కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా వెళ్లినట్టు ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ప్రాణం తీసిన వాళ్లే వారసులుగా చలామణి అవుతున్నారని ఆమె విమర్శించారు. పురందేశ్వరి దుర్మార్గురాలని ఆరోపించారు. తన వల్ల మీకు జరిగిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కొడుకులు అమాయకులని లక్ష్మీపార్వతి వెనుకేసుకుని రావడం విశేషం. ఇకనుంచి తన పోరాటం పురందేశ్వరి, చంద్రబాబు పైన అని ప్రకటించారు. తనను ఎందుకు చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది ఎన్టీఆర్ కు అవమానించడమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు.
source https://oktelugu.com/lakshmi-parvathi-sensational-comments-on-purandeshwari/